నంద్యాల జిల్లా బేతంచెర్లలో విద్యార్థిపై జరిగిన దాడి తీవ్ర చర్చకు దారితీసింది. స్థానికంగా ఉన్న శ్రీ నారాయణ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థి తేజపై హెడ్ మాస్టర్ సురేష్ బాబు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాలుడి చేయి విరిగినట్లు సమాచారం.
పాఠశాలలో జరిగిన ఈ ఘటనతో విద్యార్థి తీవ్రంగా గాయపడగా, వెంటనే కుటుంబ సభ్యులు అతడిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, హెడ్ మాస్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా, సంబంధిత పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేయాలని వారు కోరుతున్నారు.
ఇక సంఘటనపై స్పందించిన ఏఐఎస్ఎఫ్ (AISF) నాయకులు ఆగ్రహంతో పాఠశాలలోకి వెళ్లి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
also read: ఢిల్లీలో దారుణం: ఇంట్లో అగ్నిప్రమాదం… తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి