దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. లోధి కాలనీ పరిధిలోని బీకే దత్ కాలనీలో ఉన్న ఓ నివాస గృహంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి తీవ్ర అగ్నిప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో 45 ఏళ్ల మహిళతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు (13, 7 సంవత్సరాలు) ప్రాణాలు కోల్పోయారు.
ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే బాధితులు ఇంటి పై అంతస్తులో చిక్కుకుపోయినట్లు తెలిసింది. మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత సిబ్బంది లోపలికి వెళ్లి పరిశీలించగా ముగ్గురూ సజీవదహనమై ఉన్నట్లు గుర్తించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే పూర్తి స్థాయి విచారణ అనంతరం నిజమైన కారణాలు వెల్లడయ్యే అవకాశముంది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడం వల్లే బాధితులు బయటకు రాలేకపోయారని అనుమానిస్తున్నారు.
also read: విజయనగరంలో వి- పెళ్లై నెల కాకుండానే వివాహిత ఆత్మహత్య