Homeక్రైమ్అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి..

అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి..

క్రైం మిర్రర్ :  హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బండ్లగూడ జాగీర్‌లోని తన నివాసంలోనే మృతిచెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్ ఎస్‌ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ జాగీర్‌లోని అనిరుధ్ స్కూల్ సమీపంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుధాకర్ నివాసం ఉంటున్నాడు. సుమారు 11 సంవత్సరాల క్రితం స్వాతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మొదట కొన్నేళ్ల పాటు వీరి కుటుంబ జీవితం సాఫీగానే సాగింది.

అయితే ఆ తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల కుమార్తె ఉండగా, ప్రస్తుతం ఆమె తల్లి స్వాతి వద్ద ఉంటోంది. సుధాకర్ మాత్రం బండ్లగూడలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు.ఈ నెల 18వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే సుధాకర్ అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం సుధాకర్ తండ్రి శ్రీనివాస్ ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి అతడి స్నేహితుడికి సమాచారం అందించారు.

స్నేహితుడు ఇంటికి వెళ్లి చూడగా సుధాకర్ మృతి చెంది కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.పోలీసుల ప్రాథమిక విచారణలో సుధాకర్ కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసిందని తెలిపారు. గుండెపోటు కారణంగానే మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నప్పటికీ, పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
also read : తెలంగాణలో వర్షాల జోరు.. 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు