-
ఆయన సమక్షంలోనే కెసిఆర్ పై సీఎం విమర్శలు
-
అయినా ఖండించని వైనం
-
పార్టీ నుంచి వేటు వేస్తే మంచిదంటున్న క్యాడర్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. గత రెండు రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన పార్టీ మారబోతున్నారని స్వయంగా గులాబీ పార్టీ క్యాడరే చెబుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అందెశ్రీ కార్యక్రమంలో కెసిఆర్ తో పాటు భారత రాష్ట్ర సమితి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గజ్వేల్ లోనే సమాధి చేస్తానంటూ సవాల్ విసిరారు. అప్పుడు సీఎం రేవంత్ వెనుకాలే ఉన్నారు మల్లారెడ్డి. కనీసం స్పందించలేదు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేగా సభకు వెళ్లారు అనుకున్నారు. తమ అధినేత కెసిఆర్ పై విమర్శలు చేసిన సమయంలో మల్లారెడ్డి అభ్యంతరం తెలిపితే బాగుండేది. కనీసం సభ అయ్యాక అయినా.. సోషల్ మీడియాలో అయినా రేవంత్ వ్యాఖ్యలను ఖండించకపోవడంతో మల్లారెడ్డి తీరుపై గులాబీ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.
పార్టీకి దూరంగా…
Also Read:బుల్లితెర నటి జెన్నిఫర్ వింగెట్ కొత్త జీవితానికి శ్రీకారం… రెండో పెళ్లిపై అధికారిక ప్రకటన!
గత కొంతకాలంగా మల్లారెడ్డి భారత రాష్ట్ర సమితితో అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ పార్టీ సమావేశాలను ఏర్పాటు చేశారు. వాటికి సైతం మల్లారెడ్డి హాజరు కాలేదు. చివరకు పార్టీ కార్యాలయాలకు సైతం దూరంగానే ఉంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు వెళ్లడం, కాంగ్రెస్ నాయకులతో సమానంగా సీఎంకు బొకేలు ఇచ్చి స్వాగతించడం, రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
బలమైన నాయకుడు కావడంతో…
Also Read:డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి ముగింపు.. జానీ మాస్టర్‌పై నిషేధం ఎత్తివేత
మల్లారెడ్డి బలమైన నాయకుడిగా మారిపోయారు. ఆర్థిక బలం ఎక్కువ. మొన్న మధ్యన ప్రధాని మోదీ తో మల్లారెడ్డి కుటుంబం ప్రత్యేకంగా భేటీ అయింది. ఆయన కోడలు ప్రీతి రెడ్డి రాజకీయ వ్యాఖ్యల తర్వాత మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలోకి వెళ్తుందని అంతా భావించారు. కానీ ఎందుకో వెనక్కి తగ్గారు. ఇప్పుడు మాత్రం మల్లారెడ్డి పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్నారు అన్న అభిప్రాయం వినిపిస్తోంది.
నిజంగా తప్పుడు సంకేతమే…
Also Read:హైదరాబాద్‌లోని దోమలగూడ ప్రాంతంలో ముగ్గురు బాలికలు అదృశ్యం.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
సాధారణంగా పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే గులాబీ పార్టీ అధినాయకత్వం వెంటనే రంగంలోకి దిగుతుంది. తప్పుడుగా వ్యవహరించే నేతలకు నోటీసులు జారీచేస్తుంది. కానీ మల్లారెడ్డి విషయంలో మాత్రం మౌనంగా ఉంది. ఇది తప్పుడు సంకేతం అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మల్లారెడ్డి పట్ల ఇంకా పార్టీ ఊగిసలాట మంచిది కాదని.. ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని.. మల్లారెడ్డి పై వేటు వేయడమే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరి ఆ పార్టీ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.