నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలానికి చెందిన, చాపల శివ (25) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన, స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటన వెనుక ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.! స్థానికంగా వినిపిస్తున్న వివరాల ప్రకారం, కొంగర్ కలాన్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, ఓ మహిళ సదరు యువకుడి వద్ద నుంచి 55 వేల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.! అయితే చాలా రోజులైనా ఉద్యోగం ఇప్పించకపోవడంతో, తాను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని యువకుడు కోరినట్లు సమాచారం.! ఈ క్రమంలో డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయగా, సదరు మహిళ అతనిపై కేసులు పెడతానంటూ, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.!
Also Read:కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో ట్విస్ట్.. సియా కుటుంబ దుకాణానికి ఫుడ్ సేఫ్టీ నోటీసులు
ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు.! మృతుడి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే తరహాలో ఉద్యోగాల పేరుతో మరికొందరి వద్ద కూడా, సదరు మహిళా డబ్బులు వసూలు చేసినట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, ప్రస్తుతం వాటిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తుంది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏమిటి, ఉద్యోగం పేరుతో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణల్లో, వాస్తవం ఎంత వరకు ఉందనే అంశాలపై విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా పూర్తి స్థాయి దర్యాప్తుతోనే మృతుడి మరణానికి, చట్టపరమైన న్యాయం దొరుకుతుందని ప్రజలు భావిస్తున్నారు.
Also Read:గ్యారంటీ లేకుండా రూ. 20 లక్షల వరకు రుణం.. ప్రధానమంత్రి ముద్రా యోజన!