క్రైమ్ మిర్రర్, సినిమా :- బాలీవుడ్ సూపర్ హిట్ హారర్ ఫ్రాంచైజీ ‘రాగిణి MMS’లో నటించనున్నట్లు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా అధికారికంగా వెల్లడించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మూడో భాగంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.తన సోషల్ మీడియా ఖాతాలో క్లాప్ బోర్డ్ చిత్రాన్ని పంచుకున్న తమన్నా, షూటింగ్ ప్రారంభమైనట్లు తెలియజేశారు. ఈ హారర్ చిత్రంలో తమన్నా పాత్ర చాలా బోల్డ్ గా, మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి శశాంక్ ఘోష్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు.గతంలో వచ్చిన ‘రాగిణి MMS’ మొదటి భాగంలో కైనీజ్ నటించగా, రెండవ భాగంలో సన్నీ లియోన్ తన హాట్ నెస్ తో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మూడో భాగంలో తమన్నా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!
ఏపీలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ
గ్యారంటీ లేకుండా రూ. 20 లక్షల వరకు రుణం.. ప్రధానమంత్రి ముద్రా యోజన!