Homeజాతీయంగ్యారంటీ లేకుండా రూ. 20 లక్షల వరకు రుణం.. ప్రధానమంత్రి ముద్రా యోజన!

గ్యారంటీ లేకుండా రూ. 20 లక్షల వరకు రుణం.. ప్రధానమంత్రి ముద్రా యోజన!

క్రైమ్ మిర్రర్, జాతీయం:- దేశంలో చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం, స్వయం ఉపాధిని పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ముద్రా యోజన’ (PMMY) పథకాన్ని అమలు చేస్తోంది. ఎలాంటి ఆస్తుల పూచీకత్తు (గ్యారంటీ) అవసరం లేకుండానే, సూక్ష్మ, చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.తాజా సమాచారం ప్రకారం, ఈ స్కీమ్ కింద వ్యాపార అవసరాలను బట్టి మూడు దశల్లో రుణాలను అందిస్తున్నారు. వ్యాపార రంగంలో అడుగుపెట్టాలనుకునే ఔత్సాహికులకు ప్రాథమిక అవసరాల కోసం రూ. 50,000 వరకు రుణం లభిస్తుంది. తమ వ్యాపారాన్ని కొంతమేర అభివృద్ధి చేసుకోవాలనుకునే వారికి రూ. 5,00,000 వరకు రుణం అందించనున్నారు. స్థిరపడిన వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవాలనుకునే వారికి గరిష్టంగా రూ. 20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు.ఎలా దరఖాస్తు చేసుకోవాలి?ఈ రుణాలను పొందడానికి ఎలాంటి గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆసక్తి గల వ్యాపారులు తమ సమీపంలోని బ్యాంకులను సంప్రదించవచ్చు. దరఖాస్తుదారులు ఈ క్రింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

స్పష్టమైన వ్యాపార ప్రణాళిక గుర్తింపు కార్డులు:- ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడీచిరునామా ధృవీకరణ పత్రంగత కొన్ని నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్స్చిన్న వ్యాపారులు, మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తుల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో ట్విస్ట్.. సియా కుటుంబ దుకాణానికి ఫుడ్ సేఫ్టీ నోటీసులు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు