ప్రకాశం జిల్లా సింగరాయకొండలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గూడ్స్ రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికుల సమాచారం ప్రకారం.. రైల్వే ట్రాక్‌పై నలుగురి మృతదేహాలను గుర్తించిన కొందరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబం ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
మృతుల పూర్తి వివరాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
also read: హనుమకొండలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం