తిరుపతి నగరంలో కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ఎం.ఆర్. పల్లి వైకుంఠపురం ఆర్చ్ సమీపంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువతిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. స్థానికుల సమాచారం ప్రకారం.. యువతి ఆటోలో వెళ్తుండగా ఓ వ్యక్తి ఒక్కసారిగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.
also read: బస్సులో ప్యాంట్ జిప్ విప్పి అసభ్య ప్రవర్తన.. చెంప పగలగొట్టిన యువతి
దాడిలో గాయపడిన యువతిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దాడికి గల కారణాలు, నిందితుడి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
also read: ప్రేమ వివాహానికి అడ్డుగా నిలిచిందని అత్తని గొడ్డలితో చంపిన అల్లుడు.. కూతురు కళ్లముందే దారుణ హత్య