టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో సందడి నెలకొంది. మహేష్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. కొరియాకు చెందిన యువతితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో సిద్ధార్థ్ గల్లా నిశ్చితార్థ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాబోయే వధూవరులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో మహేష్ బాబు కుటుంబ సభ్యులు సందడి చేశారు. మహేష్ సోదరీమణులు, బంధువులతో పాటు ఆయన అన్నయ్య రమేష్ బాబు కుమార్తె భారతి కూడా ఈ వేడుకలో కనిపించారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేష్ సోదరి పద్మావతి, గల్లా జయదేవ్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అశోక్ గల్లా ఇప్పటికే హీరోగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘విసా’ చిత్రంలో నటిస్తున్నారు.
also read: పుట్టినరోజు రోజే విషాదం.. నడిరోడ్డుపై భార్యను కాల్చిచంపిన కానిస్టేబుల్!
ఇక సిద్ధార్థ్ గల్లా కుటుంబ వ్యాపార వ్యవహారాలను చూసుకుంటున్నారు. కొంతకాలంగా కొరియాకు చెందిన యువతి హాయిన్ (జిన్నీ)తో ప్రేమలో ఉన్న ఆయన.. ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో గల్లా, ఘట్టమనేని కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా, మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
also read: పుట్టినరోజు రోజే విషాదం.. నడిరోడ్డుపై భార్యను కాల్చిచంపిన కానిస్టేబుల్!