Homeక్రైమ్పిల్లలు పుట్టలేదని అత్తింటి వేధింపులు..? అనుమానాస్పదంగా వివాహిత మృతి!

పిల్లలు పుట్టలేదని అత్తింటి వేధింపులు..? అనుమానాస్పదంగా వివాహిత మృతి!

మంచిర్యాల జిల్లాలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన పంజాల మౌనిక (29) మృతి ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల సమాచారం ప్రకారం.. మౌనికకు సుమారు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన కొంతకాలం తర్వాత కూడా సంతానం కలగకపోవడంతో ఆమెను భర్త, అత్తమామలు మానసికంగా, శారీరకంగా వేధించారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇదే క్రమంలో ఆదివారం చింతలపల్లి ప్రాంతంలో మౌనిక మృతిచెందిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు.. అత్తింటివారే వేధించి హత్య చేసి ఉంటారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని లక్సెట్టిపేటకు తరలించి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

మౌనిక మృతి ఆత్మహత్యా? లేక ఏదైనా కారణంతో ప్రాణాలు కోల్పోయిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో వెల్లడయ్యే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతుండగా.. మౌనిక కుటుంబ సభ్యుల ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

also read: భార్య ముక్కు కోసేసిన భర్త… ప్రతీకారంతో భర్త సోదరిని ఏం చేశారంటే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు