క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ డెస్క్:- భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లలో భారత జట్టు ఘోర పరాజయాలను చవిచూడటంతో, సోషల్ మీడియాలో గంభీర్ కోచింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఓటములకు బాధ్యత వహిస్తూ కోచ్ పదవి నుంచి గంభీర్‌ను తొలగించాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
ఈ తరహా సామాజిక మాధ్యమాల ప్రచారాలు, డిమాండ్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని విశ్వసనీయ సమాచారం. గంభీర్ నాయకత్వంపై, ఆయన ప్రణాళికలపై బోర్డుకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టమవుతోంది.
కదులుతున్న రైలులో పూజ.. వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే!
2027 వన్డే ప్రపంచకప్, 2028 ఒలింపిక్సే లక్ష్యం!:- తాజా నివేదికల ప్రకారం.. గౌతమ్ గంభీర్‌ను ప్రస్తుతానికి తొలగించే ఆలోచన బోర్డుకు లేదు.2027 వన్డే ప్రపంచ కప్: రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు గంభీర్ పర్యవేక్షణలోనే బరిలోకి దిగనుంది. అంతేకాకుండా, 2028 లో లాస్ ఏంజిల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో క్రికెట్ అరంగేట్రం చేయనున్న నేపథ్యంలో, ఆ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ముగిసే వరకు కూడా భారత జట్టును సన్నద్ధం చేసే బాధ్యతను గంభీర్‌కే అప్పగించనున్నట్లు క్రీడా వర్గాల సమాచారం.తాత్కాలిక ఓటములతో నిరాశపడకుండా, భవిష్యత్ దీర్ఘకాలిక ప్రణాళికల వైపు బీసీసీఐ అడుగులు వేస్తోందని దీని ద్వారా స్పష్టమవుతోంది.
CSKతో ముగిసిన 18 ఏళ్ల బంధం: హెడ్ కోచ్ పదవికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్‌బై!