క్రైమ్ మిర్రర్, సినిమా:- టాలీవుడ్ నటుడు సునీల్, హీరోయిన్ ఎస్తేర్ నొరోన్హా మధ్య ఉన్న అనుబంధంపై ఇటీవల సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎస్తేర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, సునీల్‌తో తనకు ఉన్న బంధం పూర్తిగా పరస్పర గౌరవం, ఆలోచనా విధానం ఆధారంగా ఏర్పడిందని స్పష్టం చేశారు. తమ మధ్య వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన ప్రచారాల్లో నిజం లేదని, తమ స్నేహం సినిమాలకు అతీతమని పేర్కొన్నారు.ఎస్తేర్ నొరోన్హా కర్ణాటకలోని ఉడిపికి చెందినవారు. బాలనటిగా సినీ ప్రయాణం ప్రారంభించిన ఆమె, హిందీ చిత్రాల తర్వాత తెలుగులో 1000 అబద్ధాలు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అనంతరం భీమవరం బుల్లోడు, గరం, జయ జానకి నాయక, డెవిల్, టెనెంట్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించారు. వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె తరచూ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం మాత్రం పూర్తిగా తన సినీ కెరీర్‌పైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు.సునీల్‌తో తొలిసారి భీమవరం బుల్లోడు సినిమా సమయంలో పరిచయం ఏర్పడిందని ఎస్తేర్ చెప్పారు. ఆ పరిచయం క్రమంగా మంచి స్నేహంగా మారిందని వెల్లడించారు. ఇండస్ట్రీలో చాలా మంది కొత్త సినిమాలు, కథలు, బాక్సాఫీస్ విషయాల గురించే మాట్లాడుకుంటారని, కానీ తాము కలిసినప్పుడు అలాంటి చర్చలు చాలా అరుదుగా జరుగుతాయని అన్నారు.
జానకమ్మ ప్రేమకథలో ఊహించని మలుపులు.. ఫొటోతో మొదలైన జీవితాంతం నిలిచిన బంధం!
తమ సంభాషణలు ఎక్కువగా పుస్తకాలు, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, సామాజిక అంశాలు, వ్యక్తిగత ఆలోచనల చుట్టూనే తిరుగుతాయని ఎస్తేర్ వివరించారు. కళ అనేది సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని ఇద్దరూ నమ్ముతామని, అందుకే విజ్ఞానం, సమాజం గురించి ఎక్కువగా చర్చిస్తామని పేర్కొన్నారు.సునీల్‌ను కేవలం నటుడిగానే కాకుండా మంచి ఆలోచనా విధానం ఉన్న వ్యక్తిగా తాను గౌరవిస్తానని ఎస్తేర్ అన్నారు. ఆయనకు సామాజిక అంశాలపై మంచి అవగాహన ఉందని, వివిధ సామాజిక సమస్యలపై చర్చించడానికి ఎప్పుడూ ఆసక్తి చూపుతారని చెప్పారు. తనలో కూడా అలాంటి అవగాహన పెరగడానికి సునీల్ ప్రోత్సాహం అందించారని తెలిపారు.ఇద్దరి మధ్య ఉన్న అనుబంధానికి ఒకే విధమైన ఆలోచనా విధానం, పుస్తకాలపై ఆసక్తి, సమాజంపై బాధ్యతాయుతమైన దృక్పథమే కారణమని ఎస్తేర్ స్పష్టం చేశారు. గాసిప్‌లకు తావులేకుండా పరస్పర గౌరవంతో కొనసాగుతున్న ఈ స్నేహమే తమ బంధానికి అసలైన బలం అని ఆమె వ్యాఖ్యానించారు.
14న కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు- రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం