Homeతెలంగాణఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు...!

ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు…!

మాదాపూర్ క్రైమ్ మిర్రర్ : మాదాపూర్ డివిజన్ చందనాయక్ తాండ లో, సురేష్ నాయక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా ఆరోగ్య శిబిరం, అన్నదానం మరియు కేక్ కటింగ్ కార్యక్రమాలు జరిగాయి.

ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ , ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపెటి జైపాల్ , యాదవ కార్పొరేషన్ చైర్మన్ ఎం. రఘునాథ్ యాదవ్ , టి ఆర్ సి ఓ ఆర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మరియు శేరిలింగంపల్లి కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

వారు ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలను స్మరించుకుంటూనే, నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రస్తుత పథకాలను ప్రశంసించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీలో సురేష్ నాయక్ పనితీరును అనుసరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

సమాజ శ్రేయస్సు కోసం ఆరోగ్య శిబిరం, అన్నదానం మరియు ఉచిత మందుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టి, తన సోదరుడి సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్న నాగేశ్ ను అభినందించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు