Homeజాతీయంమహారాష్ట్రలో భూకంపం... ! భ‌యాంతో ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు

మహారాష్ట్రలో భూకంపం… ! భ‌యాంతో ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు

ముంబై,క్రైమ్‌మిర్ర‌ర్‌: మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తర్వాత వరుస భూకంపాలు సంభవించాయి. నాందేడ్, పర్భానీ, హింగోలి జిల్లాల్లో గురువారం తెల్లవారుజామున 1:37 గంటల నుండి 3:23 గంటల మధ్య నాలుగు సార్లు భూమి కంపించింది. అర్థరాత్రి వేళ భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై గరిష్టంగా 4.6గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

Also Read:Fresh US Strikes on Iran: ఇరాన్‌పై అమెరికా దాడి.. ట్రంప్ యాక్షన్ మళ్లీ మొదలైంది!

కాగా హింగోలి సమీపంలో కేంద్రం డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 1:37 గంటల నుండి 3:23 గంటల మధ్య తక్కువ వ్యవధిలోనే వరుసగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత వరుసగా 4.6, 3.6 , 3.9 గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం హింగోలి జిల్లా బస్మత్ తాలూకాలోని షిర్లీ గ్రామానికి సమీపంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో వరుసగా భూమి కంపించడంతో భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంపాలను ముందే ఊహించలేమని, భవిష్యత్తులో మరికొన్ని మైల్డ్ ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అధికారులు చెబుతున్నారు.

Also Read:ఓటీటీకి వచ్చేసిన ‘పెద్ది’: అదనపు సన్నివేశాలతో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు