Homeక్రీడలుభారత్ ఘోర ఓటమి.. కోచ్ గంభీర్‌ను తొలగించాలని ఫ్యాన్స్ డిమాండ్!

భారత్ ఘోర ఓటమి.. కోచ్ గంభీర్‌ను తొలగించాలని ఫ్యాన్స్ డిమాండ్!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఇంగ్లాండ్‌తో జరిగిన 3వ T20 మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమిని అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరి పిచ్చి ప్రయోగాల వల్లే జట్టు ఇలా తయారైందని అభిమానులు మండిపడుతున్నారు.ముఖ్యంగా, ఆటగాళ్ల ప్రదర్శన కంటే ముందు, ఈ ఓటమికి ప్రధాన కారణమైన వీరిద్దరిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో చేసిన మార్పుల పట్ల ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మ కంటే ముందు అక్షర్ పటేల్‌ను, శివమ్ దూబే కంటే ముందు రవి బిష్ణోయ్‌ను బ్యాటింగ్‌కు పంపడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.మరోవైపు, కెప్టెన్‌గా, బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ పేలవ ప్రదర్శనపై కూడా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జట్టు యాజమాన్యం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

రైల్వేలో భారీ ఉద్యోగ అవకాశాలు: 4,098 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు

నల్లమల శాసనాల్లో అమరావతి చారిత్రక ఆనవాళ్లు: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు