క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చారిత్రక ప్రాశస్త్యంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లమల ప్రాంతంలో బయటపడిన ప్రాచీన శాసనాల్లో అమరావతికి సంబంధించిన స్పష్టమైన ఆనవాళ్లు లభ్యమయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) లో ఆయన ఒక పోస్ట్ చేశారు.గత కొంతకాలంగా అమరావతిపై కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ ప్రాచీన శాసనాలే తగిన బదులిస్తాయని పవన్ స్పష్టం చేశారు. నేటి ఈ అమరావతిలోనే నాడు బౌద్ధం విశేషంగా విలసిల్లిందని, ప్రసిద్ధ అమరావతి స్తూపం ఉన్నట్లుగా ఈ శాసనాల ద్వారా బలమైన ఆధారాలు లభించాయని ఆయన తెలిపారు.”ఒకప్పుడు ప్రపంచానికే శాంతి సందేశాన్ని అందించిన గొప్ప బౌద్ధ క్షేత్రంగా అమరావతి వెలుగొందినట్లు ఈ ఆధారాలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది” అని పవన్ కళ్యాణ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.అమరావతికి ఉన్న ఘనమైన చరిత్రను, బౌద్ధ మతంతో ఉన్న అనుబంధాన్ని తెలియజేసే ఈ అమూల్యమైన చారిత్రక సాక్ష్యాలను వెలుగులోకి తెచ్చిన శాస్త్రవేత్తలు, పురావస్తు పరిశోధకులను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
England vs India 2nd T20: ఆర్చర్ దెబ్బకు కుప్పకూలిన భారత్..125 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం!