Homeఆంధ్ర ప్రదేశ్పోలీసులు వేషంలో భారీ దోపిడీ...!

పోలీసులు వేషంలో భారీ దోపిడీ…!

Crime Mirror, AP State News: పోలీసులు వేషంలో భారీ దోపిడీకి పాల్పడిన ఘటన సత్తుపల్లిలో చోటుచేసుకుంది. బ్లాక్ మనీని వైట్ గా మారుస్తామని అమాయకులకు ఆశ చూపించి అనంతరం పోలీసుల వ్యాసంలో బెదిరించి నగదు దోచుకున్న ముఠాను సత్తుపల్లి పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గురువారం సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో 14 మంది నిందితుల్లో 12 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరూ పరారీలో ఉన్నట్లు కల్లూరు ఏసిపి వసుంధర యాదవ్ ఫౌరేబి వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గత నెల 25న కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన కుర్ర గంగాధర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పట్టణ సిఐ టి శ్రీహరి కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే గంగారం శివారులో నిర్వహిస్తున్న తనిఖీల్లో 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ దర్యాప్తులో భాగంగా ఏలూరు జిల్లా వెంకటాపురానికి చెందిన ఈగ చంటిబాబు ఈ ముఠా సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. అతడు మరో 13 మందితో కలిసి వివిధ సిమ్ కార్డుల ద్వారా అమాయకులకు ఫోన్లు చేసి తాము రియల్ ఎస్టేట్ వ్యాపారుమని, తమ వద్ద ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీ గా మార్చుకోవాల్సి ఉందని నమ్మించేవారు.

ఈ క్రమంలోనే వారిని నమ్మిన అమాయకులకు 10 లక్షలు ఇస్తే 40 లక్షలు ఖాతాలో జమ చేస్తామని ఆశ చూపించేవారు. ఇలా ఆశపడినట్టు గుర్తించిన వారిని తమ ప్రాంతానికి రప్పించి బాధితులు వద్ద నగదు తీసుకుని డమ్మీ కరెన్సీ నింపిన బ్యాగును తరువాత వారికి ఇచ్చేవారు. అదే సమయంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం ముఠాలోని కొందరు నిజమైన పోలీసులు.. నకిలీ పోలీసులతో అక్కడకు చేరుకునే దాడి చేసేవారు.

నకిలీ కరెన్సీ వ్యాపారం చేస్తున్నారంటూ బెదిరించి బాధితులు వద్ద ఉన్న నగదును లాక్కొని పరారయ్యేవారు. ఇదే తరహాలో పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

  • ముఠాలో పోలీసులకు భాగం.. వారికి మామూలు..

ఈ ముఠాలో పలువురు పోలీసులు కూడా భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ తరహా అమాయకులు వచ్చినప్పుడు అసలైన పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి వారిని భయభ్రాంతులకు గురి చేసే వారిని పోలీసులు గుర్తు చేశారు. ఈ ముఠాతో సంబంధం కలిగిన వారిలో టీజీఎస్పీ 15వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ ముల్లగిరి వర్ధన్, ఆర్ఎస్ఐ బైరా కేశవరావు ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇకపోతే పోలీసులు తాజాగా పట్టుకున్న నిందితులు వద్ద రూ.17.60 లక్షల నగదు, మూడు కార్లు, ఒక స్కూటీ, సెల్ ఫోన్లు, పోలీస్ దుస్తులు, బేడీలు, డమ్మీ కరెన్సీ నోట్ల బండిలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ తరహా మోసాలు వెలుగులోకి వచ్చినట్టు అయింది.

ఇటువంటి బ్లాక్ మనీ మార్పిడి పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ ను, లాభాలు ఆఫర్లను నమ్మవద్దని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ఈ తరహా కాల్స్ వచ్చిన, ఆఫర్లు ఇచ్చేందుకు మనుషులు వచ్చినా సమాచారాన్ని తమకు అందించాలని పోలీసులు కోరారు. ఈ ముఠా బాధితులు ఎంతమంది ఉన్నారు అన్నదానిపై పోలీసులు దృష్టి సారించారు. వారి వివరాలను తెలుసుకొని వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు