Homeక్రైమ్జైలుకు బండి భగీరథ్...! ప‌రీక్ష‌లు రాసి తిరిగి స‌రేండ‌ర్‌...

జైలుకు బండి భగీరథ్…! ప‌రీక్ష‌లు రాసి తిరిగి స‌రేండ‌ర్‌…

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ను మళ్లీ చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. కొద్దిరోజుల కిందట కండిషన్ బెయిల్ పై ఆయన విడుదలైన సంగతి తెలిసిందే. ఫోక్షో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను ఇంజనీరింగ్ పరీక్షలు రాయడం కోసం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆ బెల్ గడువు ముగియడంతో పోలీసులు భగీరథ్ ను తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. భగీరథ 17 ఏళ్ల అమ్మాయిని మోసం చేసి.. మానసికంగా వేధించి.. ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్లు.. లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి కేసు నడుస్తూనే ఉంది.

Also Read:బాలయ్య చిన్న కుమార్తె పొలిటికల్ ఎంట్రీ…!

మే 16న అరెస్ట్…

మే 16న పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్ ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి అతడు చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే ఆయన బెయిల్ కోసం ఆయన తరుపు న్యాయవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ కోర్టు మాత్రం బెయిల్ మంజూరు చేయలేదు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న ఆయనకు పరీక్షలు ఉండడంతో బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాదులు కోరడంతో ఈనెల 20న మభ్యంతర బెయిల్ మంజూరు అయింది. పరీక్షలు ముగియడంతో.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి.. కట్టుదిట్ట పైన భద్రత నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు.

కీలక దశలో దర్యాప్తు …

Also Read:ఆడుదాం-ఆంధ్ర’లో రూ.100 కోట్ల అవినీతి…మాజీమంత్రి రోజా అరెస్ట్ కు రంగం సిద్దం…!

ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కీలక దశలో ఉంది. కేసు విచారణ సాధారణ ప్రక్రియలోనే కొనసాగుతోంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతోంది. పలుమార్లు బెయిల్ పిటిషన్ కోర్టులో తిరస్కరణకు గురైంది. అయితే విద్యార్థి కావడంతో మానవతా దృక్పథంతో.. ఆయన భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని మభ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్ట్. అయితే కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో రాజకీయంగా కూడా ఈ కేసు సంచలనంగా మారింది. అయితే ముందు ఈ కేసు ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

Also Read:Healthy Snacks: ఆఫీస్‌లో రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. ఈ ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తప్పక తినండి…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు