క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియమితులయ్యారు. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సి ఎస్ ఈ నెల చివర్లో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు ను నియమించింది. అయితే సంజయ్ ఎంపిక ఎవరు ఊహించలేదు. కానీ గతంలో సమర్థవంతంగా విధులు నిర్వహించడంతో ఆయనకు మంచి పేరు ఉంది. అందుకే తెలంగాణ సర్కార్ ఆయన వైపు మొగ్గు చూపింది.
స్వేచ్ఛ ఇస్తేనే…
Also Read:ఘనంగా ‘రొట్టెల పండుగ’ ప్రారంభం… దేశం నలుమూలల నుంచి భక్తుల రద్దీ!
సాధారణ పరిపాలనలో ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారి ఎంతటి మేధావి అయినప్పటికీ.. వారి ఆలోచనలకు స్వేచ్ఛనిచ్చి.. వారి ప్రతిభను గుర్తించే ఒక సమర్ధుడైన రాజకీయ నాయకత్వం ఉంటేనే అధికార వ్యవస్థకు పూర్తిస్థాయిలో అందుతాయి. బ్యూరోక్రసీలో సృజనాత్మకతను, సాంకేతిక నైపుణ్యాన్ని వెలికి తీసి.. ప్రజాప యోగమైన ప్రాజెక్టులుగా మార్చడంలో లీడర్షిప్ పాత్ర అత్యంత కీలకం. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సర్కార్ సంజయ్ జాజు సేవలను వినియోగించుకుంది. దాని ఫలితంగానే సమర్థవంతమైన అధికారిగా సంజయ్ గుర్తింపు సాధించారు. ఆ గుర్తింపు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికకు దోహదపడింది.
మనస్ఫూర్తిగా బాధ్యతలు…
Also Read:ద్రాక్షారామ కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం – 40కిపైగా దుకాణాలు ధ్వంసం
ఒక ఐఏఎస్ అధికారి కేవలం సచివాలయ గదులకే పరిమితం కాదు. వారికి చాలా బాధ్యతలు ఉంటాయి. కానీ ఆ బాధ్యతలను గుర్తు చేసి పనిచేసుకునే బాధ్యత మాత్రం ప్రభుత్వాలదే. అలా చంద్రబాబు చాలా అవకాశాలు కల్పించింది. ఒక్క సంజయ్ మాత్రమే కాదు ఐఏఎస్ అధికారులు చంద్రబాబు గైడెన్స్ లో పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అప్పట్లో సంజయ్ చంద్రబాబు సర్కార్లో పని చేశారు. కేవలం ఆదేశాలు పాటించడం మాత్రమే కాదు.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రతిపాదనలు కొన్నిసార్లు చేయాల్సి ఉంటుంది. అప్పట్లో విపరీతమైన ఒత్తిడి మధ్య సంజయ్ పనిచేసి చూపించారు. సత్ఫలితాలను అందించగలిగారు.
Also Read:Team India: ఐర్లాండ్ చేతిలో టీమిండియాకు షాక్.. తొలి టీ20లో 34 పరుగుల తేడాతో ఘోర పరాభవం!
అలా సంజయ్ రాటు తేలడం వల్లనే తదనంతర కాలంలో కేంద్ర సర్వీసులో రక్షణ, సమాచార ప్రసార శాఖల వంటి అత్యంత కీలకమైన విభాగాల్లో కార్యదర్శి స్థాయికి ఎదగగలిగారు. ప్రస్తుతం రేవంత్ సర్కార్ ఆయన ప్రతిభను పరిగణలోకి తీసుకుని ఈ నియామకం జరిపినట్లు తెలుస్తోంది. అయితే సీనియారిటీ పరంగా చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సమర్థతకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.