Homeఆంధ్ర ప్రదేశ్బాలయ్య చిన్న కుమార్తె పొలిటికల్ ఎంట్రీ...!

బాలయ్య చిన్న కుమార్తె పొలిటికల్ ఎంట్రీ…!

క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: భీమిలి నుంచి బాలయ్య చిన్న కుమార్తె పోటీ చేస్తారా? వచ్చే ఎన్నికల్లో ఆమె అక్కడి నుంచి బరిలోకి దిగడం ఖాయమా? అలా జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే చర్చ నడుస్తోంది. నందమూరి ఫ్యామిలీ అంటే ప్రత్యేక గుర్తింపు ఉంది. అందులోనూ నందమూరి బాలకృష్ణ కుమార్తెలు అంటేనే ఒక రకమైన ప్రత్యేకత ఉంది. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి భర్త మంత్రి నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. చిన్న కుమార్తె తేజస్విని భర్త విశాఖ ఎంపీ శ్రీ భరత్. గీతం విద్యాసంస్థల అధినేత. అయితే నారా బ్రాహ్మణి వ్యాపార రంగంలో రాణిస్తుండగా.. ఇప్పుడు తేజస్వినితో పొలిటికల్ ఎంట్రీ ఇప్పిస్తారన్న ప్రచారం నడుస్తోంది.

జూబ్లీహిల్స్ మాదిరిగా…

Also Read:ద్రాక్షారామ కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం – 40కిపైగా దుకాణాలు ధ్వంసం

విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ గూగుల్ డేటా సెంటర్ విశాఖ రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డేటా సెంటర్ భీమిలి నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు కానుంది. ఒక్క గూగుల్ డేటా సెంటర్ మాత్రమే కాదు ఐటీ అనుబంధ పరిశ్రమలన్నీ భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు కానున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ తరహాలో భీమిలి ఆవిర్భావం కానుంది.. దీంతో ఏపీలోనే భీమిలి నియోజకవర్గం కీలకంగా మారనుంది. అటువంటి నియోజకవర్గాన్ని తన కుటుంబ సభ్యుల చేతిలో ఉంచుకోవడానికి చంద్రబాబు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం ఉంది. మరోవైపు ఎంపి శ్రీ భరత్ వచ్చే ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయన భార్య తేజస్విని రంగంలోకి దించితే తెలుగుదేశం భవిష్యత్ రాజకీయాల కోసం ఉపయోగపడతారు అనే చర్చ జోరుగా సాగుతోంది.

గంటా కుమారుడికి వేరే ఆప్షన్…

Also Read:గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న బుల్లెట్ – ఇద్దరు మృతి

ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యేగా సీనియర్ నేత గంటా శ్రీనివాస్ రావు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. తరచు ఎన్నికలకు ఎన్నికలకు మధ్య నియోజకవర్గాలను మార్చుతుంటారు గంటా శ్రీనివాసరావు. 2019లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీనివాసరావుకు 2024 ఎన్నికల్లో చివరి నిమిషంలో భీమిలి టిక్కెట్ లభించింది. అయినా సరే అక్కడ భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఇప్పుడు బాలయ్య కుమార్తె పోటీకి దిగితే కచ్చితంగా గంటా శ్రీనివాసరావు రేసు నుంచి తప్పుకునే అవకాశం ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు బదులు.. ఆయన కుమారుడు రవితేజ పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. అయితే నియోజకవర్గాల పునర్విభజనతో.. మరో నియోజకవర్గాన్ని రవితేజకు సర్దుబాటు చేస్తారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మాత్రం తేజస్విని పోటీ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Also Read:ఘనంగా ‘రొట్టెల పండుగ’ ప్రారంభం… దేశం నలుమూలల నుంచి భక్తుల రద్దీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు