క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి రోజా అరెస్టు తప్పదా? ఆమెను త్వరలో అరెస్టు చేస్తారా? ఆడుదాం ఆంధ్రాలో భారీ అవినీతికి పాల్పడ్డారా? విజిలెన్స్ విచారణ పూర్తయిందా? 100 కోట్ల రూపాయల అవినీతి అని తేలిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల నిర్వహణలో అవినీతికి సంబంధించి విజిలెన్స్ విచారణ పూర్తయిందని.. దాదాపు 100 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు అంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. దీంతో త్వరలో రోజా అరెస్టు కావడం ఖాయమని తేలిపోయింది.
అప్పట్లో క్రీడల మంత్రిగా…
Also Read:గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట…! ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో క్రీడల శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉండేవారు. అప్పట్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహించారు. అయితే ఆ క్రీడల నిర్వహణలో దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపై విచారించింది. దాదాపు అన్ని జిల్లాల్లో విజిలెన్స్ విచారణ కొనసాగింది. అయితే అప్పట్లో నాసిరకం క్రీడా పరికరాలు కొనుగోలు, వైసిపి సానుభూతిపరులతోనే క్రీడా పోటీల నిర్వహణ, అసలు పోటీలే నిర్వహించకుండా కొన్నిచోట్ల నిధులు భారీగా ఖర్చు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా మంత్రిగా ఉన్న రోజా అప్పట్లో బినామీ కంపెనీలకు క్రీడా పరికరాల సరఫరా బాధ్యతను కట్టబెట్టారని.. నాసిరకం క్రీడా పరికరాలు అందించారని అభియోగాలు ఎదుర్కొన్నారు. అందుకే ఈ కేసులో ఆమెను ప్రధాన నిందితురాలుగా చేర్చి అరెస్టు చేసేందుకు కసరత్తు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
శాప్ చైర్మన్ హోదాలో బైరెడ్డి…
Also Read:ఈపీఎఫ్ఓ సేవలకు బ్రేక్…చందా దారులు బిగ్ అలర్ట్…!
మరోవైపు అప్పట్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సైతం అరెస్టు తప్పదు అని ప్రచారం సాగుతోంది. ఈ అవినీతిలో ఆయనకు సైతం హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. పైగా తన అరెస్టుపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. దమ్ముంటే అరెస్టు చేసుకోండి అంటూ సవాల్ చేస్తున్నారు. జైలు జీవితం తమకు కొత్త కాదు అని వ్యాఖ్యానిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంతకుమించి ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అరెస్టు తప్పదు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. విజిలెన్స్ విచారణకు సంబంధించి నివేదిక ప్రభుత్వానికి చేరింది. అందుకే అరెస్టుల పర్వం ప్రారంభం కానుంది అని మంత్రి సంకేతాలు పంపారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read:ఘనంగా ‘రొట్టెల పండుగ’ ప్రారంభం… దేశం నలుమూలల నుంచి భక్తుల రద్దీ!