హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమాల విషయంలో ఎంత పర్ఫెక్షన్ కోరుకుంటారో మరోసారి బయటపడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి షూటింగ్‌లో జరిగిన ఆసక్తికర విషయాలను మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా వెల్లడించారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న ఆయన, రాజమౌళి వర్కింగ్ స్టైల్‌ను ప్రశంసిస్తూ పలు విషయాలు పంచుకున్నారు.
Also Read:మోడీ కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం ఫిక్స్..! ..రాష్ట్రపతికి అమిత్ షా లిస్ట్?
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఒకే ఒక్క షాట్ కోసం తాను, మహేష్ బాబు కలిసి దాదాపు 94 టేకులు తీసుకున్నామని చెప్పారు. ఉదయం షూటింగ్ ప్రారంభమైనా సాయంత్రం వరకు ఆ షాట్ ఓకే కాలేదని, చివరకు ప్యాకప్ చెప్పి మరుసటి రోజు మళ్లీ అదే సీన్ చిత్రీకరించారని తెలిపారు. ఆ షాట్ చివరకు ఎలా వచ్చిందో చూసిన తర్వాత రాజమౌళి విజన్‌కు తాను ఫిదా అయ్యానని అన్నారు.
Also Read:పౌరసత్వం కోసం అదొక్కటి చాలు..!.. కేంద్రం నిర్ణయంపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్!!
రాజమౌళి పని తీరు గురించి కూడా పృథ్వీరాజ్ ఆసక్తికర విషయాలు చెప్పారు. ఉదయం 7 గంటలకు షూటింగ్ ఉంటే ఆయన 5 గంటలకే సెట్స్‌కు చేరుకుని అసిస్టెంట్ డైరెక్టర్లతో కలిసి రిహార్సల్స్ పూర్తి చేస్తారని వెల్లడించారు. తాను, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సెట్స్‌కు వచ్చే సమయానికి కెమెరాలు, బ్లాకింగ్స్ అన్నీ సిద్ధంగా ఉంటాయని చెప్పారు. లంచ్ బ్రేక్ కూడా కేవలం 20 నిమిషాలే తీసుకుంటారని, షాట్ రెడీ అనగానే భోజనం మధ్యలోనే వదిలేసి సెట్స్‌లోకి వెళ్లిపోతారని తెలిపారు.
Also Read:హైదరాబాద్‌లో రియల్ భూమ్.. రూ.80వేలు పిలికిన గజం భూమి ధర!
రాజమౌళి ప్రతి సినిమాను తన తొలి చిత్రంలాగే ఎంతో కసితో తెరకెక్కిస్తారని పృథ్వీరాజ్ అన్నారు. ఒక్కోసారి ఆయన చెప్పే సన్నివేశాలు మొదట్లో తనకు అర్థం కాకపోయినా, చివరికి తెరపై చూసినప్పుడు ఆశ్చర్యపోయేవాడినని చెప్పారు. రాజమౌళి విజన్, తన నటన మధ్య సెట్స్‌లో చిన్నపాటి పోరాటమే జరిగేదని, కానీ ఆయనపై పూర్తి నమ్మకంతో పని చేశానని తెలిపారు.
Also Read:ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు.. తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో!!
మోహన్‌లాల్ తర్వాత తాను చూసిన అత్యుత్తమ నటుడు-దర్శకుడు రాజమౌళి అని పృథ్వీరాజ్ కొనియాడారు. ఒక సీన్‌ను వివరిస్తున్నప్పుడు ఆయన స్వయంగా ఆ పాత్రలో లీనమై హావభావాలు, ఎమోషన్స్ చూపిస్తారని, దాంతో నటీనటులకు సీన్‌ను అర్థం చేసుకోవడం చాలా సులభమవుతుందని చెప్పారు. రాజమౌళితో కలిసి పనిచేయడం తనకు గొప్ప అనుభవమని, ఒక నటుడిగా, దర్శకుడిగా, వ్యక్తిగా ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు.
Also Read:శిలాఫలకంలో ట్విస్ట్… పేరు లేకపోవడంతో డిప్యూటీ సీఎం షాక్!
ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న వారణాసి పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ విశేషాలు బయటకు వస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది.