Homeజాతీయంఅమెజాన్ నుంచి రోడ్డు పైకీ రోబో టాక్సీ...! డ్రైవ‌ర్ లేకుండానే...

అమెజాన్ నుంచి రోడ్డు పైకీ రోబో టాక్సీ…! డ్రైవ‌ర్ లేకుండానే…

హైద‌రాబాద్‌,క్రైమ్ మిర్ర‌ర్‌: టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. అధునాతన సాంకేతికతను వినియోగించి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే అటానమస్ వాహణాల రంగంలో కీలక అడుగులు వేస్తున్న అమెజాన్ కు చెందిన Zoox సంస్థ తన కొత్త తరం రోబో టాక్సీ డిజైన్ అధికారికంగా ఆవిష్కరించింది. ఈ టాక్సీ సేవలను కొద్ది రోజుల్లోనే చెల్లింపు రైడ్ తరహాలో ప్రారంభించే లక్ష్యంతో కంపెనీ ఈ కొత్త మోడల్ రూపొందించినట్లు వెల్లడించింది. ప్రయాణికుల నుంచి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకొని వాహనం లోపల, బయట డిజైన్లలో పలు మార్పులను ఈ సంస్థ చేసింది. ప్రస్తుతం అమెరికాలోని పలు నగరాల్లో ఉచిత ట్రైల్ రైడ్లు నిర్వహిస్తున్న ఈ సంస్థ అవసరమైన ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే కమర్షియల్ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

Also Read:9 ఏళ్ల ప్రేమకు ముగింపు… పెళ్లితో ఒకటైన ఫైమా- ప్రవీణ్ నాయక్ జంట

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ దేశాల్లోనే కీలక నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో Zoox సంస్థ సిద్ధమవుతోంది. ఈ సంస్థ తీసుకురాబోతున్న రోబో టాక్సీ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. సాంప్రదాయ కార్ల మాదిరిగా స్టీరింగ్ వీల్, బ్రేక్ లేదా యాక్సిలేటర్ పెడల్స్ ఉండవు. ఇది పూర్తిగా కృత్రిమ మేధస్సు, కెమెరాలు, రాడార్, లెడార్ సెన్సార్ల ఆధారంగా నడుస్తుంది. వాహనం ముందు, విభాగాలు ఒకే విధంగా ఉండడంతో రెండు దశల్లోనూ సమర్థవంతంగా ప్రయాణిస్తుంది. వాహనం ముందు, వెనుక భాగాలు ఒకేలా ఉండడంతో రెండు దిశల్లోనూ సమర్థవంతంగా ప్రయాణిస్తుందని ఈ సంస్థ వెల్లడించింది.

Also Read:ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు.. తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో!!

ఈ వాహనంలో ఒకేసారి నలుగురు ప్రయాణికులు ఎదురుగా కూర్చునేలా క్యాబిన్ రూపొందించారు. కొత్త వెర్షన్ లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. Zoox సంస్థ సీట్లకు మరింత కుషన్, మెరుగైన ఎరుగోనామిక్ డిజైన్, కొత్త రంగుల మెటీరియల్, ఇంటీరియల్ ను అందించింది. టచ్ స్క్రీన్ డిస్ప్లే మరింత స్పష్టంగా మార్చడంతోపాటు పెద్ద కప్పు హోల్డర్లు, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ లో ఇంప్రూవ్మెంట్స్ చేసింది. ప్రయాణికులు మర్చిపోయిన వస్తువులు సులభంగా గుర్తించేలా లోపలి భాగాన్ని లైట్ కలర్స్ తో రూపొందించింది. రోబో ట్యాక్సీ లోపలి భాగంలో కూడా పలు మార్పులను చేశారు. వాహనం ముందు, వెనుక భాగాలు సులభంగా గుర్తించేందుకు కొత్త లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. డోర్ల వద్ద స్పీకర్లు, మైక్రోఫోన్లను అమర్చి రెండు దశల్లో కమ్యూనికేషన్ సదుపాయాన్ని కల్పించారు. దీనివల్ల ప్రయాణికులు, అత్యవసర సిబ్బంది, Zoox సపోర్టింగ్ సిబ్బంది మధ్య నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది.

Also Read:పౌరసత్వం కోసం అదొక్కటి చాలు..!.. కేంద్రం నిర్ణయంపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్!!

లేకపోతే ఈ కార్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది. కాలిఫోర్నియాలో తయారీ కేంద్రంలో ఈ కొత్త రోబో టాక్సీలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ప్రారంభ దశలో వారానికి 100 వాహనాలు వరకు తయారు చేసే సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. భవిష్యత్తులో ఏడాదికి పది వేలకుపైగా రోబో టాక్సీలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో కంపెనీ ముందుకు వెళుతోంది. ప్రపంచవ్యాప్తంగా అటానమస్ ట్యాక్సీ సేవల రంగంలో పోటీ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్ కు చెందిన Waymo కొన్ని నగరాల్లో ఈ తరహా వాహనాలతో వాణిజ్య సేవలను అందిస్తోంది. టెస్లా కూడా తన రోబో టాక్స్ సేవలను విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే Zoox కొత్త డిజైన్ భారీ ఉత్పత్తి ప్రణాళికతో ఈ పోటీలో కీలక స్థానాన్ని సంపాదించడం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతోంది.

Also Read:మోడీ కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం ఫిక్స్..! ..రాష్ట్రపతికి అమిత్ షా లిస్ట్?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు