Homeక్రైమ్పారిశ్రామికవేత్త కేతన్ హత్య కేసులో కీల‌క ప‌రిణామం...!త‌ప్పు చేస్తే ఉరితీయాల‌న్న త‌ల్లి...

పారిశ్రామికవేత్త కేతన్ హత్య కేసులో కీల‌క ప‌రిణామం…!త‌ప్పు చేస్తే ఉరితీయాల‌న్న త‌ల్లి…

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్‌: దేశంలో సంచలనం సృష్టించిన యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ హత్యకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని లోహాగడ్ కోటలో జరిగిన ఈ హత్య ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడు చేతన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై హత్య, క్రిమినల్ ప్లానింగ్ కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. రిమాండ్ లో ఉన్న వీరిద్దరూ పోలీస్ విచారణలో కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణ సందర్భంగా సియా హత్య చేసేందుకు గల కారణాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. పెళ్లికి ముందే తనకు పెళ్లి ఇష్టం లేదు అన్న విషయాన్ని కేతన్ అగర్వాల్ కు చెప్పినప్పటికీ వినలేదని విచారణ అధికారులకు వెల్లడించినట్లు చెబుతున్నారు.

Also Read:ఉచిత దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన…! ప్రతిరోజు వేయి మందికి అవకాశం…

చేతన్ చౌదరితో రిలేషన్ లో ఉన్నట్లు అగర్వాల్ కు తెలియజేశానని, తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పినప్పటికీ వినలేదనీ సియా వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని కేతన్ అగర్వాల్ పట్టించుకోలేదని, పెళ్లిరోజు చేసుకుంటే తమ ఫ్యామిలీ పరువు పోతుందని చెప్పినట్లు సియా పోలీసులకు వివరించింది. ఒకవేళ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి పారిపోవాలని చూసిన వదిలిపెట్టేది లేదని కేతన్ బెదిరించినట్లు తెలియజేసింది. ఈ క్రమంలోనే తనకు ఎవరైనా ఇబ్బందులతో ఈ పని చేసినట్లు వెల్లడించింది. తాను చెప్పిన మాటలను అంగీకరించి ఉండి పెళ్లికి నిరాకరిస్తే సరిపోలేదని, చేతన్ చౌదరితో కలిసి బతకాలన్న ఉద్దేశంతోనే ఈ తప్పు చేసినట్లు పోలీసులు విచారణలో సియా తెలియజేసింది.

కూతురును ఉరితీయాలి అన్న సియా తల్లి…

Also Read:గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట…! ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం…

ఈ ఘటన నేపథ్యంలో సీయా తల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె తప్పు చేసి ఉంటే కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను హత్య చేసినట్లు రుజువైతే ఆమె కఠిన శిక్షకు అర్హురాలని, సియాను ఉరితీయాలని ఆమె స్పష్టం చేశారు. సియా తండ్రి ప్రవీణ్ గోయల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. తప్పు రుజువైతే తన కూతురు అయినప్పటికీ ఉరిశిక్ష తీయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇకపోతే ఈ ఘటన తరువాత రెండు రోజుల కిందట ప్రవీణ్ గోయల్ కు గుండెపోటు వచ్చింది. దీంతో ప్రస్తుతం ఆయన పూణేలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read:ఈపీఎఫ్ఓ సేవ‌ల‌కు బ్రేక్‌…చందా దారులు బిగ్ అల‌ర్ట్‌…!

కేతన్ అగర్వాల్, సియాకు వివాహం నిర్ణయించిన తర్వాత గ్రాండ్ గా పెళ్లి చేసేందుకు కేతన్ అగర్వాల్ కుటుంబం ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. 17 కోట్ల రూపాయలతో వివాహాన్ని చేసేందుకు బ్యాలెన్స్ బుక్ చేసిన అగర్వాల్ కుటుంబ సభ్యులు.. బంధువులను తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్స్ ను కూడా బుక్ చేశారు. మరి కొద్ది రోజుల్లో వివాహం జరుగుతుంది అనుకునే సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ ప్రక్రియ సాగుతోంది.

Also Read:మహా వికాస్ అఘాడీలో ఉద్ధవ్ బాంబ్… కూటమిపై ఘాటు వ్యాఖ్యలు…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు