తిరుపతి, క్రైమ్‌మిర్రర్: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మేలు చేకూర్చేలా మరో కీలక నిర్ణయాన్ని టీటీడీ తీసుకుంది. ప్రతిరోజు మంది వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉచితంగా దర్శనం కల్పించేందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ ఉచిత దర్శనాల కోసం భక్తులు మూడు నెలలు ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం ప్రశాంతంగా పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఉచిత దర్శనాల టికెట్లు పొందును వారికి స్వామి వారి రూ.50 రూపాయలు విలువచేసే లడ్డూను కూడా ఉచితంగా ఇవ్వనుంది.
Also Read:తమిళనాడులో 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్… నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
తిరుమలలోని నంబి ఆలయం వద్ద సీనియర్ సిటిజన్ ప్రత్యేక దర్శనం క్యూలైన్ ద్వారా మధ్యాహ్నం మూడు గంటలకు దర్శనానికి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. తిరుమలలో స్వామివారి దర్శనానికి అవకాశం కల్పిస్తామంటూ కొంతమంది దళారులు మోసం చేస్తున్నారు. అటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది. అలాగే స్వామివారి దర్శనానికి సంబంధించి, సీనియర్ సిటిజనులకు స్వామివారి దర్శన అవకాశం కల్పించే విషయంలోనూ సోషల్ మీడియాలో కొన్ని రకాల తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. అటువంటి వాటిని విశ్వసించవద్దని టీటీడీ తాజాగా వెల్లడించింది. సీనియర్ సిటిజనులకు ప్రత్యేకంగా దర్శనానికి అవకాశం కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ సూచించింది.
మోస పూరిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి…
Also Read:పశ్చిమ బెంగాల్ సీఎంపై టీఎంసీ ఎంపీ ప్రశంసలు.. పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం!!
తిరుమలలో ఇటీవల కొంతమంది దళారులు భక్తులను మోసం చేస్తున్న విషయాన్ని టీటీడీ గుర్తించింది. ఈ తరహా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని భక్తులను హెచ్చరించింది. ముఖ్యంగా కొంతమంది దళారులు శ్రీవారి దర్శనం, వసతి గదులు పేరుతో భక్తులను మోసగిస్తున్నారు. ఇటువంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. భక్తులు కొంతమంది వీరు మాయమాటలు నమ్మి మోసపోతున్నారు. ఇటువంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది టీటీడీ. దర్శనం, వసతి గాజుల టికెట్లను ఇప్పిస్తామని సంప్రదిస్తే తమకు ఫిర్యాదు చేయాలని టిటిడి వెల్లడించింది.
Also Read:కొత్త బస్సులో సీఎం విజయ్ సవారీ.. ప్రజలతో కలిసిన ‘రియల్ లీడర్’
ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్ 155257ను ఏర్పాటుచేసిన టీటీడీ, మోసపూరిత కాల్ చేస్తే దీనికి ఫోన్ చేసి వెంటనే సమాచారాన్ని అందించాలని సూచించింది. స్వామివారి దర్శనం, వసతి కల్పిస్తామంటూ మధ్యవర్తులు, దళారుల మాటలు విని డబ్బులు పోగొట్టుకోవద్దని, అటువంటి వారి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ తరహా మోసాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొంది.
Also Read:ప్రకృతిలో మాయలో మునిగే ప్రయాణం.. మధురానుభూతి అందించే పాకాల అందం