ముంబై,క్రైమ్‌మిర్రర్: మహారాష్ట్ర రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజులుగా శివసేన (యుబిటి)కు చెందిన ఎంపీలు మాజీ ముఖ్యమంత్రి షిండే శివసేన వర్గంలో చేరుతుండడంతో ఉద్ధవ్ థాక్రే చిక్కుల్లో పడ్డట్టు అయింది. ఆరుగురు ఎంపీలు పార్టీ మారడంతో ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్ర మహా వికాస్ అఘాడీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు పార్టీ మారినప్పటికీ కూటమిలోని ఇతర పార్టీ నాయకులు స్పందించకపోవడం పట్ల ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మనం నిజంగానే కలిసి ఉన్నామా అంటూ ఆయన భాగస్వామ్య పక్షాలను ప్రశ్నించడం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read:పౌరసత్వం కోసం అదొక్కటి చాలు..!.. కేంద్రం నిర్ణయంపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్!!
కూటమిలోని ఒక పార్టీపై ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా దాడి చేస్తూ బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో.. కూటమి పక్షాలు కనీసం స్పందించకపోవడం పట్ల ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆరుగురు ఎంపీలు సండే వర్గంలో చేరిన తర్వాత పార్టీ శ్రేణులతో తాజాగా ఉద్ధవ్ థాక్రే సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలోని అంతర్గత పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పార్టీ నాయకులు తనను మోసం చేసి వెళ్లిపోయిన తీరును కార్యకర్తలకు తెలియజేసి అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ, శరత్ పవర్ (ఎన్సీపీ) పార్టీ పైన కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. మహా వికాస్ అఘాడీ కూటమి ఐక్యత పైన అనేక సందేహాలను ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కూటమి పార్టీలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీలు తాజా రాజకీయ పరిణామాలపై స్పందించక పోవడాన్ని ఆయన తప్పు పెట్టినట్లు తెలుస్తోంది.
బహిర్గతం చేసిన కూటమిలోని సమన్వయ లోపం…
Also Read:ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు.. తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో!!
మహారాష్ట్రలోని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఎంవీఏ కూటమిలో నెలకొన్న విభేదాలను తాజా పరిస్థితులు బహిర్గతం చేసినట్టు అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ క్లిష్ట పరిస్థితుల్లోకి వెళుతున్న సమయంలో కూటమి పక్షాలు స్పందించాల్సిన నైతిక బాధ్యత ఉంది. అనైతిక చర్యలకు పాల్పడుతూ ఎంపీలను పార్టీ మార్పించుకునే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. ఈ చర్యలను తప్పుపట్టాల్సిన ఇతర పక్షాలు కనీసం పట్టకుండా ఉండడం గమనార్హం. దీనిపైనే తాజాగా ఉద్ధవ్ తన అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ వ్యూహాలు, నాయకత్వ అంశాల్లో ఎంబీఏ భాగస్వాముల మధ్య పూర్తిస్థాయి సమన్వయం లేదని భావన శివసేన (యుబిటి)లో నెలకొంది. ఈ క్రమంలోనే మనం నిజంగానే కలిసి ఉన్నామా లేదా అనే ప్రశ్నను ఉద్ధవ్ మిత్రపక్షాలకు సంధించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎంవీఏలోని ఇతర పక్షాల నాయకులు స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇకపోతే మహారాష్ట్రలో తాజాగా నెలకొన్న పరిణామాలపై షిండే వర్గం నేతలు ఉద్ధవ్ ను లక్ష్యంగా చేసుకునే విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read:ప్రకృతిలో మాయలో మునిగే ప్రయాణం.. మధురానుభూతి అందించే పాకాల అందం
ఉద్ధవ్ నాయకత్వ వైఫల్యంగా వారంతా విమర్శిస్తున్నారు. పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు వరుసుగా బయటకు వస్తుండడం ఉద్ధవ్ పై విశ్వాసం తగ్గిపోవడానికి నిదర్శనంగా ఆ వర్గం వాదిస్తోంది. దాదా పరిస్థితిలో నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో షిండే – బిజెపి కూటమి మరింత బలంగా తయారైంది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష శిబిరంలో అనిచ్చితి వాతావరణము నెలకొంది. ప్రస్తుతం శివసేన ఎదుర్కొంటున్న ఇబ్బందులను భవిష్యత్తులో ఈ పక్షంలోని ఇతర పార్టీలు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిధులు విశ్లేషిస్తున్నారు. సమస్య తమది కాదు అన్నట్టు వ్యవహరించడం ద్వారా భవిష్యత్తులో తమ వరకు వచ్చిన తర్వాత మరింత ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ తరహా చర్యలకు అడ్డుకట్ట వేయడం ద్వారా భవిష్యత్తు ఇబ్బందులను అధిగమించేందుకు అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ పరిణామాలపై ఎంవీఏ లోని పక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.
Also Read:9 ఏళ్ల ప్రేమకు ముగింపు… పెళ్లితో ఒకటైన ఫైమా- ప్రవీణ్ నాయక్ జంట