మెదక్, క్రైమ్మిర్రర్: మెదక్ జిల్లా టెక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో నివసిస్తూ ఇన్స్టాగ్రామ్లో తన పేరు రుత్విక్ రెడ్డిగా మార్చుకుని, ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్నానని అదే గ్రామానికి చెందిన యువతితో ఉప్పరి దుర్గయ్య పరిచయం పెంచుకున్నాడు. ఖర్చులకు డబ్బులు కావాలని, తననే పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.5 లక్షలు, తులం బంగారం కాజేసాడు.
Also Read:తెలంగాణపై పవన్ పక్కా పొలిటికల్ స్కెచ్…!
సాత్విక్ రెడ్డి పేరుతో మరో ఐడీ సృష్టించి ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలికను ట్రాప్ చేసి, ఎంబీబీఎస్ చదువుతున్నానని నమ్మించి రూ.7 లక్షలు కాజేసాడు. దుర్గయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయామని గ్రహించి బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:రేపు ఆదివారం అయినా స్కూళ్లకు వెళ్లాల్సిందే.. రాష్ట్రంలో యోగా దినోత్సవంపై విద్యాశాఖ ఆదేశాలు