Homeఆంధ్ర ప్రదేశ్నేడు పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ...!

నేడు పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ…!

  • 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.3,125.47 కోట్లు

  • అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. పిఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ నిధులు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి విడత నిధులు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.

Also Read: తెలంగాణపై దృష్టి పెట్టిన జనసేనాని.. మణికొండలో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం!! – Crime Mirror

రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.5,000.. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద రూ.2000.. కలిపి రూ.7000 చొప్పున జమ చేయనున్నాయి. గత ఏడాది అన్నదాత సుఖీభవ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో ఏడాది కూడా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.

  • పీఎం, సిఎం చేతుల మీదుగా..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా ఈ నిధుల జమకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. పిఎం కిసాన్ నిధులను పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ లో ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ ను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

Also Read: ఎంపీ VS ఎమ్మెల్యే…! – Crime Mirror

అన్నదాత సుఖీభవ నిధులను అదేరోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగం గుంట్ల గ్రామంలో సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పిఎం కిసాన్ తో పాటు మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ నిధులను జమ చేశారు. ఈ ఏడాది కూడా అదే విధంగా నిధుల విడుదలకు సిద్ధమయ్యారు.

  • భారీగా నిధులు..

రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు రూ.3125.47 కోట్లు జమ కానున్నాయి. రాష్ట్ర వాటా కింద రూ.2,342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.782. 5 కోట్లు విడుదల కానున్నాయి. కాక పీఎం కిసాన్ పథకానికి ఈ కేవైసీ తప్పనిసరి. అర్హత ఉండి సాయం దక్కని వారి కోసం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కు అవకాశం ఇవ్వనున్నారు.

Also Read: కుక్క కోసం ఆవును కొన్నాడు…. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు – Crime Mirror

Also Read: విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్.. ప్రతిష్ఠాత్మక ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ!! – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు