Homeతెలంగాణఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పిస్తాం.. సర్పంచ్ రమావత్ విజయ లక్ష్మణ్...

ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పిస్తాం.. సర్పంచ్ రమావత్ విజయ లక్ష్మణ్ నాయక్

క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : మండలంలోని కమ్మగూడ గ్రామపంచాయతీ పరిదిలోని తండాలకు పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే తమ గ్రామ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివించేందుకు సిద్ధంగా ఉన్నామని కమ్మగూడ గ్రామపంచాయతీ సర్పంచ్ రమావత్ విజయ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. దామెర భీమనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం చేపడుతున్న బడిబాట కార్యక్రమం సందర్భంగా భీమ్లా తండాలో తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అధిక శాతం కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడినవిగా ఉండటంతో ప్రైవేట్ వాహనాలకు అధిక మొత్తంలో ఖర్చు చేయలేకపోతున్నామని, మరోవైపు ప్రభుత్వ విద్యాసంస్థలకు వెళ్లేందుకు సరైన రవాణా లేక గత్యంతరం లేక ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోయారు. ఈ నేపథ్యంలో భీమ్లా తండా – దామెర భీమనపల్లి – నేరెళ్లపల్లి – చండూరు మార్గంలో ఉదయం సుమారు 8 గంటలకు, అలాగే సాయంత్రం 4 గంటలకు విద్యార్థుల రాకపోకలకు అనుకూలంగా ఆర్టీసీ బస్సు నడపాలని గ్రామస్థులు, సర్పంచ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తే భీమ్లా తండాతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల చేరికలు పెరిగే అవకాశం ఉందని సర్పంచ్ రమావత్ విజయ లక్ష్మణ్ నాయక్ అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు