Homeసినిమాపెళ్లిపై రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు: 'సమాజం పెట్టిన రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు!

పెళ్లిపై రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు: ‘సమాజం పెట్టిన రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు!

క్రైమ్ మిర్రర్,సినిమా :- టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లి వ్యవస్థపై మరియు నేటి తరం ఆలోచనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజం విధించిన పాతకాలపు నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో రష్మికకు వివాహ వ్యవస్థకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. “ఈ రోజుల్లో నేటి తరం (జెన్-జీ) యువత పెళ్లిని ఒక ‘అవుట్ డేటెడ్ కాన్సెప్ట్’ (కాలం చెల్లిన పద్ధతి)గా భావిస్తోంది.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?” అని ప్రశ్నించగా, రష్మిక ఎంతో స్పష్టతతో స్పందించారు.

ఈ విషయంపై రష్మిక మాట్లాడుతూ… “అమ్మాయిలకు పెళ్లి అనేది తప్పనిసరి అని, ఒక నిర్దిష్ట వయసు రాగానే కచ్చితంగా పెళ్లి జరిగిపోవాలని మన సమాజం కొన్ని కఠినమైన నియమాలను ఏర్పాటు చేసింది. సమాజం పెట్టిన ఈ నిబంధనల వల్లే నేటి తరం యువత (జెన్-జీ) పెళ్లి పట్ల ఆ విధంగా ఆలోచిస్తోంది” అని విశ్లేషించారు.భాగస్వాముల ఇష్టమే ముఖ్యం:పెళ్లి అనేది కేవలం సమాజం కోసం చేసుకునేది కాదని అభిప్రాయపడుతూ.. “పెళ్లి అనేది సమాజం పెట్టిన నియమ నిబంధనలకు అనుగుణంగానే జరగాల్సిన అవసరం అస్సలు లేదు. ఆ బంధంలో ఉండే ఇద్దరు భాగస్వాములు ఒకరినొకరు ఎలా కోరుకుంటున్నారనేదే ముఖ్యం. వారి మధ్య అవగాహన, పరస్పర గౌరవం ఉంటే సరిపోతుంది” అని రష్మిక పేర్కొన్నారు.ప్రస్తుతం రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పెళ్లి విషయంలో సమాజం చూపే ఒత్తిడి కంటే ఇద్దరు వ్యక్తుల ఇష్టానికే ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆమె బోల్డ్ స్టేట్‌మెంట్‌కు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు