Homeవైరల్సంక్రాంతి-2027: బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ అగ్ర హీరోల మహా సమరం!

సంక్రాంతి-2027: బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ అగ్ర హీరోల మహా సమరం!

క్రైమ్ మిర్రర్, సినిమా :- టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘సంక్రాంతి’ సీజన్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బడా హీరోలంతా తమ సినిమాలను పండగ బరిలో దించేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. అయితే, 2027 సంక్రాంతి టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఓ ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచిపోనుంది. దశాబ్దాలుగా తెలుగు సినిమా బాక్సాఫీస్‌ను ఏలుతున్న సీనియర్ స్టార్ హీరోలంతా ఒకేసారి తమ భారీ చిత్రాలతో థియేటర్ల వద్ద దండయాత్రకు సిద్ధమవుతున్నారు.

పండగ బరిలో నిలవనున్న బడా సినిమాలు ఇవే:-
1. మెగా 158 : ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా 158’ ఈ పండగ రేసులో ముందు వరుసలో ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

2. నాగార్జున 100వ సినిమా:- కింగ్ నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా కూడా పండగ కానుకగా జనవరి 15నే థియేటర్లలోకి రానున్నట్లు తెలుస్తోంది. ‘సంక్రాంతి సోగ్గాళ్లు’ వస్తున్నారంటూ ఇప్పటికే చిత్ర బృందం హింట్ ఇచ్చింది.

3. వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్:- ఫ్యామిలీ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించేందుకు విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘#VenkyAnil5’ (వెంకీ-కల్యాణ్ రామ్ మల్టీస్టారర్) మూవీ కూడా రాబోయే సంక్రాంతినే టార్గెట్ చేసింది.

4. బాలకృష్ణ (NBK111): నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘NBK111’ చిత్రం కూడా ఈ పండగ బరిలోనే నిలవనుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

ఈ రేసులో యువ హీరోలు కూడా..సీనియర్ స్టార్ హీరోలతో పాటు యువ హీరోలు కూడా ఈ రేసులో పోటీ పడనున్నారు. ముఖ్యంగా శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రాబోతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది.ఒకే పండగ సీజన్‌లో టాలీవుడ్ అగ్ర హీరోలందరూ ఒకేసారి పోటీ పడుతుండటంతో 2027 సంక్రాంతి మరింత స్పెషల్ కానుంది. ఏ సినిమా ఏ స్థాయి రికార్డులను సృష్టిస్తుందో, బాక్సాఫీస్ విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలంటే అప్పటివరకు వేచి చూడాల్సిందే!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు