Homeతెలంగాణఈగల్‌ ఫోర్స్‌ భారీ ఆపరేషన్‌.. ఒడిశా నుంచి తరలిస్తున్న 500 కిలోల గంజాయి స్వాధీనం!!

ఈగల్‌ ఫోర్స్‌ భారీ ఆపరేషన్‌.. ఒడిశా నుంచి తరలిస్తున్న 500 కిలోల గంజాయి స్వాధీనం!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణకు గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్‌ ఫోర్స్‌ భారీ ఆపరేషన్‌ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఒడిశా నుంచి తరలిస్తున్న 500 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని బలిమేళా నుంచి జయపూర్‌ వరకు దాదాపు 80 కిలోమీటర్ల మేర బొలెరో వాహనాన్ని ఈగల్‌ ఫోర్స్‌ బృందం వెంబడించింది. అడవి ప్రాంతంలో వాహనాన్ని నిలిపివేసిన డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేయగా 115 ప్యాకెట్లలో గంజాయి లభించింది. స్వాధీనం చేసుకున్న గంజాయిలో 90 ప్యాకెట్లు 5 కిలోల చొప్పున, మరో 25 ప్యాకెట్లు 2 కిలోల చొప్పున ఉన్నట్లు గుర్తించారు. గంజాయితో పాటు బొలెరో వాహనాన్ని ఒడిశాలోని కొరాపుట్‌ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్వాధీనం చేసుకున్న వాహనం ఒడిశాలోని నబరంగ్‌పూర్‌ జిల్లాకు చెందిన అమీర్‌ అలీ ఖాన్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ అయినట్లు గుర్తించారు. 2024లోనూ ఈగల్‌ ఫోర్స్‌ ఇలాంటి ఆపరేషన్‌ చేపట్టి రాంచీ వరకు వెంబడించి 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. తాజాగా నిర్వహించిన హైరిస్క్‌ ఆపరేషన్‌పై ఒడిశా పోలీసులు ఈగల్‌ ఫోర్స్‌ బృందాన్ని అభినందించారు.

తాజావార్తలు