మంచిర్యాల, క్రైమ్ మిర్రర్: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జనుగామ గ్రామంలో బుధవారం సర్పంచ్ మారిశెట్టి పద్మ నూతన బోర్ వెల్ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మారిశెట్టి పద్మ మాట్లాడుతూ, చెన్నూర్ ఎమ్మెల్యే,తెలంగాణ రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ, మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి ప్రత్యేక కృషితో మంజూరైనా నూతన బోర్ వెల్ ను ప్రారంభించడం జరిగిందన్నారు.
Also Read:డబ్బు అవసరమే ఉండదన్న ప్రపంచ డబ్బున్నోడు ఎలాన్ మస్క్.. అదే లాజిక్ అట.!
గ్రామ పంచాయతీలో నీటి ఏద్ధడి తలెత్తకుండ మంత్రి చొరవతో కృషి చేయనున్నట్లు తెలిపారు, గ్రామస్తులు మంత్రి వివేక్ వెంకటస్వామి, సర్పంచ్ మారిశెట్టి పద్మ లకు కృతజ్ఞతలు తెలియజేసారు, ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిపి దుర్గం వెంకటస్వామి, మాజీ ఎంపిటీసి మారిశెట్టి తిరుపతి, ఉప సర్పంచ్ తలండి ముత్తయ్య, వార్డ్ సభ్యులు భూతం తిరుపతి, పర్సవేనా రాజన్న, తలండి బాణక్క, రాజక్క, ప్రవీణ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read:కొడుకును హీరోగా లాంచ్ చేయనున్న ధనుష్…!