అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ వేడుకల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రసంగిస్తుండగా కొంతమంది విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. జూన్ 14న జరిగిన ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
సమాచారం ప్రకారం, గూగుల్ సంస్థ అమెజాన్ తో కలిసి ఇజ్రాయెల్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న “ప్రాజెక్ట్ నింబస్” ఒప్పందం ఈ నిరసనలకు కారణమైంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇజ్రాయెల్ ప్రభుత్వ విభాగాలు, పబ్లిక్ సంస్థలు, అలాగే మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన డిజిటల్ సేవలను క్లౌడ్ ఆధారిత వ్యవస్థలకు మార్చే పనిని ఈ టెక్ దిగ్గజాలు చేపడుతున్నాయి.
అయితే, గాజా ప్రాంతంలో జరుగుతున్న మిలిటరీ చర్యల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పిచాయ్ ప్రసంగం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. “పాలస్తీనాకు స్వేచ్ఛ” వంటి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
I laureati della Stanford University durante il discorso del CEO di Google Sundar Pichai, lasciano la cerimonia per protestare contro i contratti di Google con IDF e ICE.
Loro sono attrezzati benissimo per distorcere la realtà, ma oramai tutti sanno chi sono. pic.twitter.com/hOTLsj4gIT— mostro ✊🏼 🇵🇸 (@avantibionda) June 15, 2026
ఈ సంఘటనతో పాటు, అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో టెక్ రంగంపై, ముఖ్యంగా ఏఐ ప్రభావంపై కూడా చర్చలు జోరందుకున్నాయి. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలపై ఏఐ ప్రభావం ఉంటుందనే భయం విద్యార్థుల్లో కనిపిస్తోంది. ఇదే కారణంగా ఇటీవల టెక్ కంపెనీల ప్రతినిధులు, సీఈఓలు పలు క్యాంపస్‌లలో నిరసనలను ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా సుందర్ పిచాయ్ విద్యార్థులకు ధైర్యం ఇచ్చే సందేశాన్ని అందించారు. ప్రపంచంలో ఎప్పటికప్పుడు సవాళ్లు వస్తూనే ఉంటాయని, ప్రతి తరం కొత్త సమస్యలను ఎదుర్కొంటుందని ఆయన పేర్కొన్నారు. పరిస్థితులు మన చేతుల్లో లేకపోయినా, వాటిని ఎలా స్వీకరిస్తామన్న దానిపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సూచించారు.
ప్రస్తుత పరిణామాలు టెక్నాలజీ, రాజకీయాలు, విద్యా రంగాల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాలను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. టెక్ కంపెనీల నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రతిస్పందనలకు దారి తీస్తున్నాయో ఈ ఘటన మరోసారి వెల్లడించింది.
also read: హైదరాబాద్‌లో కాస్టింగ్ పేరుతో మోసం.. నటిని వేధించిన ఆర్టిస్ట్‌పై కేసు