Homeలైఫ్ స్టైల్Nagabandham: అనుకున్న దానికంటే 5 రెట్లు పెరిగిన బడ్జెట్..!

Nagabandham: అనుకున్న దానికంటే 5 రెట్లు పెరిగిన బడ్జెట్..!

Crime Mirror, Cinema Latest Updates: పెదకాపు ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం నాగబంధం విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న ఈ అడ్వెంచరస్ మైథలాజికల్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత నిషితా నాగిరెడ్డి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బడ్జెట్ ఎంతైందంటే..!

నాగబంధం కోసం తొలుత అనుకున్న బడ్జెట్ కంటే 4 నుంచి 5 రెట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చిందని నిషితా తెలిపారు. అయితే సినిమా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో భారీ స్థాయిలో నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు. సినిమా అవుట్‌పుట్‌పై చిత్రబృందం పూర్తి సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు.

Also Read: రమేష్ కుటుంబానికి అండగా కాంగ్రెస్ నాయకులు – రూ.10 వేల ఆర్థిక సహాయం..!

సినిమా మొత్తం ఒకే తరహాలో సాగదని, ప్రతి పది నిమిషాలకు ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించేలా రూపొందించామని నిషితా చెప్పారు. సాధారణంగా సినిమాల్లో ఒకే సెట్స్, ఒకే తరహా విజువల్స్ కనిపిస్తుంటాయని, కానీ నాగబంధంలో ప్రతి సెటప్ ప్రత్యేకంగా ఉండేలా రూపొందించామని వెల్లడించారు.

ఈ చిత్రంలో విరాట్ కర్ణతో పాటు నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్, తారక్ సినిమాస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ మూవీ పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ్ ఆలయాల గుప్తనిధుల నేపథ్యాన్ని ప్రేరణగా తీసుకుని తెరకెక్కింది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే స్థాయిలో ఉండబోతుందని చిత్రబృందం చెబుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో జూలై 3న నాగబంధం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: ఐఫోన్‌ వల్లే జననాల రేటు పడిపోయిందా? షాకింగ్ స్టడీ!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు