Homeజాతీయంకాంగ్రెస్ లో తృణమూల్ విలీనంపై అప్డేట్.. షాకింగ్ కామెంట్స్ చేసిన వేణుగోపాల్.!

కాంగ్రెస్ లో తృణమూల్ విలీనంపై అప్డేట్.. షాకింగ్ కామెంట్స్ చేసిన వేణుగోపాల్.!

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత అక్కడ మమతా బెనర్జీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 20 మందికి పైగా ఎంపీలు, 60 మందికి పైగా తృణమూల్ ఎమ్మెల్యేలు రెబల్గా మారి అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు మమతా బెనర్జీ కీలక అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ ను విలీనం చేసేందుకు ఆమె సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన స్పందిస్తూ టీఎంసీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందనే ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న వంట ప్రచారమైననే పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న వార్తల్లో నిజం లేదని కొట్టి పారేశారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ కార్యాచరణలను స్వతంత్రంగానే కొనసాగిస్తుందని టీఎంసీ కూడా తన పార్టీ విధానాల ప్రకారమే ముందుకు సాగుతుందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో టిఎంసి విలీనం జరుగుతుందన్న ప్రచారంపై ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దునే సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, టీఎంసీలు మధ్య విలీనానికి సంబంధించిన ఎటువంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఈ తరహా ప్రతిపాదనలు కూడా లేవని కేసి వేణుగోపాల్ స్పష్టత ఇచ్చారు.

ప్రచారానికి తెరపడుతుందా.? లేదా.?

గతంలో ఎన్నడు లేని విధంగా తరుణములు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను పశ్చిమ బెంగాల్లో ఎదుర్కొంటుంది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత అనేక ఓడుదుడుకులను ఎదుర్కొని మరి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు. సుదీర్ఘ కాలం పాటు పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని అనుభవించిన కమ్యూనిస్టులను ఎదురొడ్డి మరి ఆమె అధికారాన్ని దక్కించుకున్నారు. 15 ఏళ్ల పాటు అధికారాన్ని చలాయించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇబ్బందుకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. తృణమూల కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్లి బిజెపిలో చేరిన సువేందు అధికారి ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా బిజెపి శ్రేణులు రెచ్చిపోతున్నారు. అనేక చోట్ల ఆ పార్టీకి చెందిన నాయకులు పై దాడులు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎదుర్కొంటూనే పార్టీని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంలో మమతా ఉన్నప్పటికీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, తాజా ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు, గత లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతుండడంతో మమత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బిజెపి స్ట్రాటజికల్ గానే మమతా బెనర్జీని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆలోచనలో పార్టీ నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, క్యాడర్ ను కాపాడుకోవడంతోపాటు జాతీయస్థాయిలో తన వాణిని బలంగా వినిపించేందుకు ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనలు పెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఖండించడంతో భవిష్యత్తులో మమత అడుగులు ఎటువైపు వేస్తారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు