Homeఅంతర్జాతీయంకాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు పదవి...!

కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు పదవి…!

  • కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు పదవి…!

  • కర్ణాటక సీఎం సలహాదారుడిగా నియామకం

  • క్యాబినెట్ హోదా వర్తింపు

  • దక్షిణాదిలో కాంగ్రెస్ బలోపేతం కోసమే..

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: కర్ణాటకలో డీకే శివకుమార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడైన డిజిటల్ ప్లానర్ సునీల్ కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం సునీల్ కొనుగోలుకు సీఎం ముఖ్య సలహాదారు పదవితో పాటు క్యాబినెట్ హోదా కల్పించారు. ఒక మంత్రికి లభించే అధికారిక నివాసం, రవాణా, ప్రోటోకాల్, ఇతర సకల ప్రభుత్వ సౌకర్యాలు, జీతభత్యాలు ఆయనకు లభించునున్నాయి.

Also Read:Sharvari: ‘ఆల్ఫా’ టీజర్‌లో శర్వరీ ఎక్కడ? సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!

గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఇదే ఆఫర్ చేసినా..సునీల్ కొనుగోలు తిరస్కరించారు. ఇప్పుడు డీకే శివకుమార్ సర్కారులో మాత్రం స్వీకరిస్తున్నారు.

తెలంగాణలో ఇస్తారని ప్రచారం..
వాస్తవానికి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుడిగా సునీల్ కొనుగోలుకు పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యూహ సలహాలు అందించారు సునీల్ కొనుగోలు. అంతకుముందు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేసరికి ఆ ఛాన్స్ ఇచ్చారు తెలంగాణలో.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన సునీల్ కొనుగోలుకు రేవంత్ పదవి ఆఫర్ చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ ఆ పని జరగలేదు. ఇప్పుడు సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. సునీల్ కొనుగోలు నియామకానికి సంబంధించి జీవోను కూడా జారీ చేశారు.

Also Read:Bangladesh Win: 21 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం!

రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సునీల్ కొనుగోలు ఆ పదవిలో కొనసాగుతారు. సునీల్ కొనుగోలు బెంగళూరు జెపి నగర్ నాలుగో ఫేజ్ నివాసి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం వ్యూహాలు రూపొందించారు. ఆ నమ్మకంతోనే ప్రభుత్వం సునీల్ కొనుగోలుకు ఝాన్సీ ఇచ్చింది.

ఇంతవరకు తెర వెనుకే..
అయితే ఇంతవరకు తెర వెనుక కార్యకలాపాలకు పరిమితం అయ్యేవారు సునీల్ కొనుగోలు. తెర ముందుకు వచ్చేందుకు అస్సలు ఇష్టపడేవారు కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం వెనుక ఆయన వ్యూహాలు పనిచేశాయి. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీ అధికారంలో ఉంది. కర్ణాటకలో సైతం కొనసాగిస్తోంది. మొన్ననే కేరళలో అధికారంలోకి వచ్చింది.

Also Read:ఇంజనీరింగ్ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్.. జూన్ 19 నుంచే ప్రారంభం

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ కీలక భాగస్వామిగా ఉంది. అయితే మున్ముందు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే హవాను కొనసాగించేందుకు వీలుగా.. సునీల్ కొనుగోలు సేవలను వినియోగించుకునేందుకు కర్ణాటక నుంచి క్యాబినెట్ హోదా పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read:పెద్ద శరీరం.. చిన్నపిల్ల మనసు!.. ఏనుగు తెలివికి సెల్యూట్!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు