Homeక్రైమ్మైనర్ పై అత్యాచార కేసు రాయ‌డానికి లంచం డిమాండ్ చేసిన పోలీసులు...!లోకాయుక్తాకు చిక్కిన మ‌హిళ కానిస్టేబుల్‌....

మైనర్ పై అత్యాచార కేసు రాయ‌డానికి లంచం డిమాండ్ చేసిన పోలీసులు…!లోకాయుక్తాకు చిక్కిన మ‌హిళ కానిస్టేబుల్‌….

కలబుర్గి, క్రైమ్‌మిర్ర‌ర్‌: చెత్త ఏరుకునే మహిళ కుమార్తె (మైనర్)పై అత్యాచారం జరిగింది. ఈ కేసులో చార్జ్షీట్ వేయాలని, మీకు అనుకూలంగా రాయాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని స్టేషన్ అధికారిణి జ్యోతి, ఏఎస్సై శివశరణప్ప బాలిక తల్లిని డిమాండ్ చేశారు.కూతురిపై అఘాయిత్యం జరిగి బాధపడుతుంటే, కర్ణాటకలోని కలబురగిలోని స్టేషన్ బజార్ పోలీసులు డబ్బుల కోసం వేధించడంతో ఆమె వేదనకు గురైంది.

దీంతో కొందరు సామాజిక కార్యకర్తల సాయంతో లోకాయుక్తను ఆశ్రయించింది. ఆమె నుంచి జ్యోతి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు దా..డి చేశారు. లంచం తీసుకుంటూ మహిళా కానిస్టేబుల్ జ్యోతి లోకాయుక్తకు చిక్కగా, ఏఎస్సై శివశరణప్ప పరారయ్యాడు.

తాజావార్తలు