అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారించే తీరు ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు, ఎలా స్పందిస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆయన వ్యవహారశైలి ఎప్పుడూ చర్చనీయాంశమవుతూనే ఉంటోంది. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్చూ ఇచ్చిన ఆయన.. ఈ సందర్భంగా వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మైక్ వేసిరేసి, ఇక చాలంటూ ఇంటర్వ్యూ నుంచి నిష్క్రమించిన తీరు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై ట్రంప్‌కు పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నలు సంధించారు.
Also Read: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.
ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న చర్చలు ఎక్కడి వరకు వచ్చాయంటూ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యాఖ్యత ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పందించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్న తరుణంలోనే ఆమె మరో ప్రశ్నను సంధించారు. గత ప్రభుత్వం అన్యాయంగా పలువురిని లక్ష్యం చేసుకుందని ఆరోపిస్తూ.. వారికి పరిహారం ఇచ్చే ఉద్ధేశంతో ప్రతిపాదించిన యాంటీ వెపనైజేషన్ స్కీమ్ గురించి ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన ట్రంప్ మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ తాను గతంలో చేసిన ఆరోపణలను సమర్థించుకున్నారు. అయితే, వీటికి ఆధారాలు చూపించాలంటూ హోస్ట్‌గా వ్యవహరించిన క్రిస్టెన్ వెల్కర్ పదే పదే ట్రంప్‌ను ప్రశ్నించారు. దీంతో ట్రంప్ తీవ్ర అసహనానికి లోనై సంయమనాన్ని కోల్పోయారు.
ఆధారాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించిన ట్రంప్
ఇంటర్వ్యూ నిర్వహించిన జర్నలిస్టు ఆధారాలను పదే పదే అడగడంతో ట్రంప్ స్పందించారు. చాలా ఆధారాలున్నాయన్న ట్రంప్.. ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు కాలిఫోర్నియాలో జరుగుతున్న మేయర్ ఎన్నికల్లోనూ అదే జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఓటింగ్ పూర్తయిన కౌంటింగ్ ఆలస్యమవుతుండడం దీనికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు.
Also Read: Supreme Court verdict: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు..!
పోస్టల్ బ్యాలెట్ వల్ల ఆలస్యమవుతుందని హోస్ట్ పేర్కొనగా.. ఆ వాదనను అధ్యక్షుడు తోసిపుచ్చారు. ఆ సందర్భంగా ఇరువురి మధ్య చర్చ తీవ్రస్థాయికి దారి తీస్తుండడంతో ట్రంప్ స్పందించారు. ఇచ చాలు ఆపేద్దాం, ధాంక్యూ అంటూ మైక్రోఫోన్‌ను తీసేసి ట్రంప్ కింద పడేశారు.
ఇంటర్వ్యూను కొనసాగిద్దాంటూ హోస్ట్ కోరినప్పటికీ ఇప్పటికే చాలా సమయం ఇచ్చానంటూ ట్రంప్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Also Read: ఓట్జీ మమ్మీ రహస్యం: మరణం తర్వాత సూక్ష్మజీవులు ఎలా బ్రతికాయి?