Homeఅంతర్జాతీయంబ్రిటన్‌లో పాక్‌ ముఠాల ఆగడాలు.. మహిళపై 700 మంది లైంగిక దాడులు.!

బ్రిటన్‌లో పాక్‌ ముఠాల ఆగడాలు.. మహిళపై 700 మంది లైంగిక దాడులు.!

క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- పాకిస్తాన్‌కు చెందిన ముఠా సభ్యులు కొందరు బ్రిటన్‌లో అకృత్యాలకు పాల్పడుతున్నారు. బాలికలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని సాదాసీదా వ్యక్తులు చెప్పడం లేదు. ఆ దేశంలోని ఉన్నత స్థానాల్లో వ్యక్తులే చెప్పడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యుడు రూపెల్ట్‌ లోవ్‌ తాజాగా మాట్లాడుతూ పాకిస్థాన్‌ మూలాలు ఉన్న వ్యక్తులు బ్రిటన్‌లో సాగించిన అకృత్యాలు, అరాచకాలను బయటి ప్రపంచానికి తెలియజేశాడు. లైంగిక దాడులకు గురైన వారిలో ఎంతో మంది చిన్నారులు, మహిళలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మైనర్‌గా ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి జరిగిందని ఒక మహిళ వెల్లడించారని, మూడేళ్లలో ఆమెపై 600 నుంచి 700 మంది మంది అత్యాచారం చేసిన విషయాన్ని తెలియజేసిందని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే ఆమె ప్రైవేటు భాగాలను తీవ్రంగా గాయపరిచినట్టు మరో మహిళ ఉదంతాన్ని ఆయన తాజాగా వెల్లడించారు. బాధితులను జంతువులు మాదిరిగా చూసినట్టు ఆయన తెలిపారు. శ్వేతజాతీయులనే లక్ష్యంగా చేసుకుని ఈ ముఠాలు లైంగిక హింసకు పాల్పడినట్టు ఆయన తెలిపారు. కొందరు పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపైనా అనేక ఆరోపణలు ఉన్నట్టు ఆయన తాజాగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బ్రిటన్‌ చట్ట సభలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పాకిస్థాన్‌కు చెందిన వారిపై తీవ్ర ఆరోపణలు..

బ్రిటన్‌లో లైంగిక వేధింపులకు సంబంధించిన వ్యవహారంపై గతంలోనే చర్చ జరిగింది. ఈ తరహా అరాచకాలు తొలిసారిగా 2002లో వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్‌కు చెందిన ఎంతో మంది దేశ వ్యాప్తంగా కొన్ని వర్గాల అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని లైంగిక దాడులు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. సౌత్‌ యార్క్‌షైర్‌లో 2010లో కొందరు మైనర్‌ అమ్మాయిలను వేధించిన కేసులో పాకిస్థాన్‌ మూలాలున్న ఐదుగురు దోషులుగా తేలడంతో అప్పట్లో సంచలనం సృష్టించింది. అనంతరం రోచ్‌డేల్‌, రోథర్‌ హ్యామ్‌, ఓల్డ్‌ హ్యామ్‌, టెల్పోర్డ్‌ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఈ వ్యవస్థీకృత ముఠాల అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారాలపై చట్ట సభల్లో చర్చ జరగ్గా.. పాక్‌ ముఠాల్లో బాధితులుగా మారిన ఎంతో మందికి సంబంధించిన విషయాలను బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యుడు రూపెల్ట్‌ లోవ్‌ వెల్లడించారు. బ్రిటన్‌లో లైంగిక వేధింపుల ముఠాల అరాచకాలపై అక్కడి చట్టసభ మరోసారి చర్చ నిర్వహించడంతో ఆయన మాట్లాడి ప్రపంచానికి ఈ విషయాలను వెల్లడించారు. అనేక రాష్ట్రాల్లో చిన్నారులు, మహిళల లైంగిక దోపిడీకి సంబంధించిన స్వతంత్ర దర్యాప్తు నివేదికలోని సంచలన విషయాలను భాహ్య ప్రంచానికి తెలిసేలా చేసింది. ఈ దారుణాలకు పాల్పడిన వారిలో ఎక్కువ శాతం పాకిస్తాన్‌ మూలాలు ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులే ఉన్నట్టు గతంలోనే తేలగా.. తాజా నివేదిక అదే విషయాన్ని దృవీకరించడం గమనార్హం.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు