-
రంగంలోకి సేవాదళం
-
జెన్-జీ , జెన్-ఆల్ఫాను ఒడిసి పట్టుకునే పనిలో జనసేన అధినేత
-
రంగంలోకి పార్టీ ఆర్మీ
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప ఆలోచన చేశారు. పార్టీని భావితరాలకు అందించే వీలుగా.. డిజిటల్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఒక సేవాదళంను రంగంలోకి దించారు. ప్రస్తుతం దేశంలో జెన్-జీ , జెన్-ఆల్ఫా ట్రెండ్ నడుస్తున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా ఒక ఆర్మీని రంగంలోకి దించాలని నిర్ణయించారు.
దానికి సేవాదళంగా పేరు పెట్టారు. సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంటుంది. కానీ కేవలం పాతతరం రాజకీయం చేయడం వల్ల.. భవిష్యత్తు తరాలకు అందుకోలేము అని భావిస్తున్నారు.జెన్-జీ , జెన్-ఆల్ఫా బలంగా వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో అందరికంటే ముందుగానే మేల్కొన్నారు పవన్ కళ్యాణ్.
అభిమానాన్ని సైన్యంగా..
జనసేన అంటే విపరీతమైన అభిమానం ఉన్న ఒక సైన్యం. పవన్ కళ్యాణ్ కు భారీగా అభిమాన గణం ఉంది. దానిని ఒక సైన్యంగా మార్చి.. వారి సేవలను వినియోగించుకోవాలన్నది పవన్ ఆలోచన. అందుకే తన ఆర్మీని రంగంలోకి దించారు. ఇన్స్టాగ్రామ్, రీల్స్, మీమ్స్ ద్వారా ప్రజలకు చేరువ కావాలని భావించి.. సరికొత్త డిజిటల్ మీడియా ఆర్మీని రంగంలోకి దించనున్నారు.
కేవలం రాజకీయాలు, ఓట్లు మాత్రమే కాదు.. జనసేన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే గురుతర బాధ్యత ఈ సేవాదళం తీసుకోనుంది. జనసేన కోసం సరికొత్తగా ఇన్ఫ్లుయెన్సర్లు పనిచేయనున్నారు. విపత్తుల సమయంలో సైతం వీరు సేవలు అందించనున్నారు.
సిద్ధాంతపరంగా..
జనసేన సిద్ధాంతాల విషయంలో ప్రత్యేక ఆలోచనతో ఉంటారు పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీని ఒక రోల్ మోడల్ గా తీసుకుంటారు. బిజెపి భావజాలాన్ని ఆ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకెళ్లే విధానాన్ని జనసైనికులకు వివరిస్తుంటారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా జెన్-జీ , జెన్-ఆల్ఫా విధానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో.. ముందుగా అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు పవన్.
దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇలాంటి ముందస్తు ఆలోచన చేయలేదు. కానీ ముందుగానే గ్రహించి రంగంలోకి దిగారు పవన్. సేవాదళాన్ని, తన అభిమాన ఆర్మీని రంగంలోకి దించి సరికొత్త రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.