Homeతెలంగాణరైతులకు శుభవార్త...రుణమాఫీ చేస్తూ త‌మిళ‌నాడు ప్రభుత్వం నిర్ణయం...!

రైతులకు శుభవార్త…రుణమాఫీ చేస్తూ త‌మిళ‌నాడు ప్రభుత్వం నిర్ణయం…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: రైతులకు శుభవార్తను అందిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు చేసిన రుణాలను మాఫీ చేస్తూ సీఎం కీలక ప్రకటన చేశారు. కొద్దిరోజుల కిందట తమిళనాడులో అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటికే వినూత్నమైన నిర్ణయాలతో పాలన సాగిస్తున్న విజయ్ మరో ఆసక్తికరమైన నిర్ణయాన్ని తీసుకొని అందరినీ షాక్ కు గురి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కీలక ఫైళ్ళపై సంతకాలు చేసిన విజయ్.. ఎన్నికల్లో ఇవ్వని అంశాలపైన కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనీ రైతులకు మేలు చేసే అతిపెద్ద నిర్ణయాన్ని ప్రకటించారు సీఎం విజయ్. రాష్ట్రంలోని రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా రైతు రుణమాఫీ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని విజయ్ స్వయంగా గతంలో చెప్పినప్పటికీ రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో రైతు రుణమాఫీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న లక్షలాదిమంది రైతులకు మేలు చేకూరుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఎందుకంటే విజయ్ ఎన్నికల్లో దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ రైతులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

రుణమాఫీతో లక్షలాది మంది రైతులకు లబ్ధి…

గడచిన ఎన్నికల్లో తమిళనాడులో టీవీకే పార్టీ అధికారం దక్కించుకుంది. డీఎంకే, ఏఐఏడీఎంకే కూటములను సమర్థవంతంగా ఎదుర్కొని అత్యధిక స్థానాలను దక్కించుకునే విజయ్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. అధికారాన్ని చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలను తీసుకుంటూ ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయాన్ని సీఎం విజయ్ తీసుకున్నారు. అదే రైతు రుణమాఫీ. సహకార బ్యాంకుల నుంచి 2017 మే ఒకటో తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 28 మధ్య రూ.50 వేల వరకు పంట రుణాలు పొందిన సన్నకారు రైతులకు రుణమాఫీ చేయాలని సీఎం విజయ్ ఆదేశించారు. ఈ మేరకు రైతులు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.50 వేలకు మించి రుణం తీసుకున్న వారికి స్థాయి వారీగా కొంత మేర మొత్తం రుణమాఫీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఈ నిర్ణయం పట్ల రైతులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పులు ఊబిలో కూరుకుపోతున్న రైతులకు ఈ నిర్ణయం భరోసాను ఇస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలోనే అన్ని థియేటర్లలో కొత్త చిత్రం విడుదలైన రోజు నుంచి ఏడు రోజుల వరకు ప్రతిరోజు 5 షోలకు అనుమతిస్తూ కూడా విజయ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంగా విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి. తాజాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై యాక్షన్ తీసుకుంటూ విజయ్ జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

అత్యాచారానికి గురైన బాలికకు సంబంధించిన విషయాలను వెల్లడించేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు నవ్వులు చిందిస్తూ వ్యవహరించిన ఘటనపై సీఎం విజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు స్పందించాల్సిన తీరు ఇది కాదంటూ సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో.. ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఆయన యాక్షన్ తీసుకున్నారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఎం విజయ్ సరికొత్త పాలనకు ఈ నిర్ణయాలు నిదర్శనంగా నిలుస్తాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు