హైదరాబాద్, క్రైమ్మిర్రర్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రెండు వారాలు వ్యవధిలో నాలుగోసారి సముద్ర సంస్థలు భారీగా ధరలను పెంచేసాయి. తాజాగా లీటర్ పెట్రోలుపై రూ.2.61, డీజిల్ పై రూ2.71 చొప్పున బాదేసాయి. దీంతో రెండు వారాల్లో నాలుగోసారి ధరలను పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో లీటర్కు మొత్తంగా రూ.8.05 పెరగగా, డీజిల్ పై తాజాగా పెరిగిన రూ.2.86 పైసలతో రూ.7.88 రూపాయలు చొప్పున భారం వినియోగదారుల పైన పడింది. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులపై భారీగా భారం పడనుంది.
ఇరాన్ – అమెరికా మధ్య యుద్ధం నేపథ్యంలో ఇంధన రేట్లు పెంచుతున్నట్లు చమురు సంస్థలు గతంలో ప్రకటించాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని, 60 రోజులపాటు హోర్ముజును తెరుస్తారన్న వార్తలు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడుచుముడు ధర దాదాపు 5% వరకు తగ్గింది. బ్రెంట్ క్రూడాయిల్ బారెల్ ధర కూడా సోమవారం 95.41 డాలర్లకు తగ్గగా దేశంలోని ప్రభుత్వం పెట్రోల్ ధరలను భారీగా పెంచాయి. దీనిపట్ల వినియోగదారులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పెరిగిన ధరలతో పెట్రోల్ ధరలు గరిష్ట స్థాయికి చేరాయి.
2024 ఎన్నికల ముందు తగ్గింపు.. ఇప్పుడు వరుసగా పెంపు…
కేంద్ర ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజులు ముందు పెట్రోల్ ధరలను స్వల్పంగా తగ్గించింది. లీటర్ పెట్రోల్ కు రెండు రూపాయలు చొప్పున ధర తగ్గించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ధరల పెంపు ఆలోచన చేయలేదు. అయితే అమెరికా – ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గడిచిన 15 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ధరలు పెంచారు. తాజాగా పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12 కు చేరగా, డీజిల్ ధర రూ.95.20కు చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.25 కు చేరగా, డీజిల్ ధర రూ.104.96 కు చేరింది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.116.38 కాగా, డీజిల్ ధర రూ.104.10 కి చేరింది.
ప్రతిపక్షాల నుంచి విమర్శలు…
కేంద్రం మరోసారి డీజిల్, పెట్రోల్ ధరలను పెంచడంతో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై పెట్రోల్ భారం పడుతుందని తాము గతంలోనే చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. ధరలు పెంచే మనిషి మళ్ళీ బాదేసారంటూ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మోడీకి ఒకటే పని అని, అదేమిటంటే ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, ఇతర సమయాల్లో జనాల జేబులు గొల్ల చేయడం అని రాహుల్ ఆరోపించారు.
దేశంలో ఆర్థిక తుఫాను వస్తుందని కొన్ని నెలల నుంచి తాము హెచ్చరిస్తున్నామని, మోడీ మాత్రం ఎన్నికల హడావిడిలో అవి మూసిన తర్వాత పెట్రో ధరలు పెంచడంలో బిజీగా ఉన్నారని ఆయన మండిపడ్డారు. రోజువారి దోపిడీ వల్ల ఎవరు లాభపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ప్రజలకంటే కంపెనీల లాభాలే బిజెపికి ముఖ్యమంటూ ఆయన విమర్శించారు.