Homeఆంధ్ర ప్రదేశ్మోగిన రాజ్యసభ నగారా...!

మోగిన రాజ్యసభ నగారా…!

  • ఏపీ నుంచి నలుగురు సభ్యుల పదవీ విరమణ

  • వారి స్థానంలో కొత్త వారి ఎన్నికకు ఈసి నోటిఫికేషన్

  • అన్ని పార్టీల్లో ఆశావాహులు అధికం

  • ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులపై స్పష్టత

 

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రం నుంచి పదవీ విరమణ చేయనున్న నలుగురు సభ్యుల స్థానంలో కొత్త వారి భర్తీ కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలకు చెందిన 24 మంది సభ్యులు పదవీ విరమణ చేయడంతో వారి స్థానంలో కొత్తవారి ఎంపిక కోసం ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఏపీ నుంచి నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, టిడిపికి చెందిన సానా సతీష్ పదవీ విరమణ చేస్తున్నారు. వీరి స్థానంలో కొత్త వారి ఎంపిక కోసం నోటిఫికేషన్ జారీ చేసింది ఈసీ. వచ్చే నెల 18న ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోనున్నారు.

కూటమికి ఏకపక్షమే…

రాష్ట్రంలో కూటమికి ఏకపక్ష బలం ఉంది.164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఈ నాలుగు స్థానాలు కూటమి ఖాతాలో చేరనున్నాయి. అయితే ఇందులో సానా సతీష్ ఏడాదిన్నర కిందట రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ అయ్యారు. అయితే భర్తీ చేసిన సమయంలోనే మరోసారి రెన్యువల్ ఇస్తామని అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ మేరకు ఆయనకు కొనసాగింపు ఉంటుంది. అయితే మిగిలిన మూడు రాజ్యసభ పదవులు.. మూడు పార్టీలు సమానంగా తీసుకుంటాయా? లేకుంటే టీడీపీ రెండు తీసుకుని జనసేనకు ఒకటి విడిచి పెడుతుందా? లేకుంటే బిజెపికి టిడిపి రెండు తీసుకుంటుందా? లేకుంటే మూడు పదవులు మూడు పార్టీలు పంచుకుంటాయా? అన్నది సస్పెన్స్ గా మారింది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం ప్రకటించనుంది కూటమి.

టిడిపిలో జూనియర్లతో పాటు సీనియర్లు…

తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశావాహులు చాలామంది ఉన్నారు. సీనియర్లతో పాటు జూనియర్లు సైతం ఆ పదవిని ఆశిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు రాజ్యసభ పదవిని ఆశిస్తున్నారు. ఆయన ఎంతవరకు మంత్రిగా చేశారు. ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం కొనసాగారు. ఒకసారి స్పీకర్ కూడా అయ్యారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి యనమలకు కీలక పదవి దక్కుతూ వచ్చింది. అయితే చివరిగా గౌరవప్రదమైన పదవీ విరమణను ఆయన కోరుకుంటున్నారు. తనకు ఇష్టమైన కేంద్ర రాజకీయాలకు ఒక్కసారైనా వెళ్లాలని చూస్తున్నారు.

పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న నేత. ఆపై బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు అవకాశం దొరికి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి వర్ల రామయ్య, కేఎస్ జవహర్ వంటి నేతలు ఉన్నారు.. మరోవైపు భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ సైతం రేసులో ఉన్నారని తెలుస్తోంది.

ఆ రెండు పార్టీలది అదే పరిస్థితి…

మరోవైపు రాష్ట్రం నుంచి బిజెపికి ఒక పదవి కేటాయిస్తే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేసులో ఉంటారని తెలుస్తోంది. మరోవైపు తమిళనాడుకు చెందిన అన్నామలై పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏపీ నుంచి రాజ్యసభకు పంపించి.. తరువాత క్యాబినెట్లోకి తీసుకుంటారని టాక్ నడుస్తోంది. జనసేనకు సైతం ఈసారి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఆ పార్టీ నుంచి ప్రముఖంగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు వినిపిస్తోంది. కొత్తగా మరో పారిశ్రామికవేత్తతో పాటు ప్రముఖ నిర్మాత పేరు తెరపైకి వచ్చింది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు