Homeతెలంగాణసూర్య కరుప్పు సినిమాపై కేసు.. మద్రాస్ హైకోర్టు షాకింగ్ కామెంట్స్...!

సూర్య కరుప్పు సినిమాపై కేసు.. మద్రాస్ హైకోర్టు షాకింగ్ కామెంట్స్…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పు సినిమా విడుదలైనప్పటి నుంచి వరుస వివాదాల్లో నిలుస్తోంది. తాజాగా ఈ సినిమాపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాలో న్యాయవ్యవస్థను, జడ్జిలను ప్రతికూలంగా చూపించారని ఆరోపిస్తూ ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. సినిమాపై నిషేధం విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. సినిమా అనేది కళాత్మక వ్యక్తీకరణలో భాగమని, సమాజంలో జరిగే వాస్తవాలను చూపించే హక్కు దర్శకులకు ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు, న్యాయవ్యవస్థలో అవినీతి ఆరోపణలు గతంలో కూడా వచ్చిన విషయమేనని, అలాంటి అంశాలను సినిమాలో చూపించడమే తప్పు కాదని బెంచ్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో కరుప్పు సినిమా ఇప్పటికే మరో వివాదంలోనూ చిక్కుకుంది. సంగీత దర్శకుడు ఇళయరాజాపై సెటైరికల్ డైలాగ్ ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో, మూవీ టీమ్ క్షమాపణలు తెలిపింది. ఆ సన్నివేశాన్ని తొలగిస్తామని లేదా మార్చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

ఆర్.జే. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన కరుప్పు సినిమాలో సూర్యతో పాటు త్రిష కీలక పాత్రల్లో నటించారు. కోర్టు నేపథ్యంతో సాగే ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే వరుస వివాదాలు సినిమాకు మరింత ప్రచారం తీసుకొస్తున్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు