•ప్రజా పాలన సమావేశంలో చైర్‌పర్సన్ సంధ్యారాణి
రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:-ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ డా. గోడిసెల సంధ్యారాణి అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్, అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, చేయూత, మహిళా సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, పింఛన్లు, ఉచిత బియ్యం, విద్యా సహాయం తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజా సంక్షేమం, పట్టణ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి అర్హుడికి అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో డిప్యూటీ మేయర్, బెల్లంపల్లి, చెన్నూర్ మున్సిపల్ చైర్‌పర్సన్లు, క్యాతన్‌పల్లి వైస్ చైర్‌పర్సన్ మిట్టపల్లి సరిత, కౌన్సిలర్లు మద్దెల శంకర్, జంజూపల్లి శశికుమార్, వేనంక శ్రీనివాస్, కృపానందం, బబ్బర స్వర్ణలత, గుర్రం శ్రీనివాస్, రంగా లక్ష్మి, పల్లా శ్రీదేవి, ధమాంక శిరీష, మంతెన మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.