Homeఆంధ్ర ప్రదేశ్రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి...!నారా లోకేష్‌

రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి…!నారా లోకేష్‌

కడప, క్రైమ్‌మిర్ర‌ర్‌: వైఎస్‌ జగన్ ప్రెస్ మీట్ చూశాక ఆయనకు ఛీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చని అన్పించింది. తల్లి, చెల్లిని తరిమేశారు, బాబాయిని లేపేసి మరో చెల్లి కుటుంబానికి అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… సొంత జిల్లాను, సొంత నియోజకవర్గాన్ని కూడా ఆయన మోసం చేశారు. 2019లో సొంత బాబాయిని లేపేసింది జగన్మోహన్ రెడ్డి. తొలుత గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలివేటు బయటకు వచ్చింది. తర్వాత దొంగపేపర్ లో నారాసుర రక్తచరిత్ర అని రాసి చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి ఫోటో వేశారు. తర్వాత జగన్ ఎంత మోసగాడో ప్రజలకు అర్థమైంది. అందుకే వైకాపాకు ముద్దుగా గొడ్డలిపార్టీ అని పేరుపెట్టాం.

రపరపా అన్నది వారే కదా. జగన్ సినిమా చూపిస్తే ఎండ్ కార్డు వేసే బాధ్యత మా కేడర్ ది. జగన్ నటనకు ఖచ్చితంగా భాస్కర్ అవార్డు గ్యారంటీగా వస్తుంది. ఆ నటన చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. బయట ముద్దులు పెట్టి, లోపల గొడ్డలి పోటువేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరిని జగన్ మేనమామ చంపేసి, మాపై కేసు పెడతామని బెదిరిస్తారా, ప్రతిపక్షంలోనే మేం భయపడలేదు, ఇప్పుడు కేసులకు భయపడతామా? రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి. కడపలో ఒక పెద్దాయన ఎగిరెగిరి పడుతున్నారు. త్వరలో ఆయన టైమ్ కూడా వస్తుంది, చట్టాలు ఉల్లంఘించిన వారిని వదిలేది లేదు. ఎవరూ ఆయనను కాపాడలేరు.

2029 లోగా కడప స్టీల్ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం…

ప్రజలంతా గుండెపై చేయివేసుకొని ఆలోచించండి. జగన్ సిఎంగా ఉండగా కడపకు ఒక్క పరిశ్రమ తెచ్చారా, ఒక్క సాగునీటి ప్రాజెక్టు తెచ్చారా, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే బాధితులను పట్టించుకున్నారా? యువగళం పాదయాత్ర సమయంలో ఇదే కడప గడ్డపై నేను మిషన్ రాయలసీమను ప్రకటించాను. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తానని మాట ఇచ్చి, ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నాం. గత రెండేళ్లలో రూ. లక్షకోట్ల పరిశ్రమలు రాయలసీమకు తెచ్చాం. 2029 ఎన్నికల్లోపు కడప స్టీల్ ప్లాంట్ కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించేలా నేను బాధ్యత తీసుకుంటా. గొడ్డలి పార్టీకి ఫ్యాక్షనిస్టులుంటే మనవద్ద ఫైటర్లు ఉన్నారు. పసుపుసైన్యం గుండె ధైర్యం చాలాగొప్పది, అవతల ఎవరు ఉన్నా మనం తగ్గేదే లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఒక కుటుంబంలా పార్టీ బలోపేతానికి కలసికట్టుగా పనిచేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు