Homeఆంధ్ర ప్రదేశ్మోడీ పిలుపు.. కాన్వాయ్ లను సగానికి తగ్గించిన ఏపీ నాయకులు!

మోడీ పిలుపు.. కాన్వాయ్ లను సగానికి తగ్గించిన ఏపీ నాయకులు!

క్రైమ్ మిర్రర్, జాతీయం :- మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఇంధన వినియోగాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా తగ్గించాలి అని పిలుపు ఇచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మోడీ పిలుపుతో ఏకంగా రాజకీయ నాయకులందరూ కూడా ఇందన వినియోగాన్ని తగ్గించే విధంగా తమ కాన్వాయులను సగానికి సగం తగ్గించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మంత్రి లోకేష్ తో పాటుగా మంత్రులు అందరు కూడా తమ కాన్వాయ్ లను సగానికి సగం తగ్గించేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేడు కేవలం నాలుగు కారులతోనే సచివాలయానికి చేరుకున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు కార్ల చొప్పున సచివాలయానికి చేరుకున్నారు. కచ్చితంగా నరేంద్ర మోడీ ఏ విషయాన్ని అయినా సరే ఆలోచించే చెబుతారు అని.. కాబట్టి ఇందన వినియోగంపై నరేంద్ర మోడీ పిలుపును ప్రతి ఒక్కరు కూడా పాటించాలి అనే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు చేస్తున్నారు. కాబట్టి దేశ వస్తువులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి అని నరేంద్ర మోడీ తెలిపిన విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది సెలబ్రిటీలు సైతం ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఏపీలో మొద‌లైన‌ స్థానిక ఎన్నికల సందడి…!

ర‌క్ష‌ణ రంగానికి కేంద్ర‌బిందువు కానున్న ఏపీ…!పుట్ట‌ప‌ర్తిలో యుద్ద విమానాల త‌యారీ…

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు