మంచిర్యాల, క్రైమ్‌మిర్రర్: జర్మనీలో పని చేయడం ఒక అవకాశమే కాదని చాలెంజ్ కూడా అని రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన గనులశాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో ట్రిపుల్ విన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్పులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టామ్కం ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఇదీ కేవలం ప్రారంభం మాత్రమేనని అన్నారు. అక్కడికి వెళ్లేవారు కొత్తబాష, కొత్తవాతావరణం, కొత్త విధానాలకు అలవాటువడాల్సి ఉంటుందని కష్టపడి నేర్చుకుంటే విజయాలు సాధిస్తారన్నారు.
ఈ బ్యాచ్‌లో జర్మనీలో మంచి ప్రతిభ కనబరిస్తే భవిష్యత్లో తెలంగాణ యువతకు అవకాశాలు వస్తాయని తెలిపారు. నర్పిం గ్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. అందరికి నర్సింగ్ డే శుభాకాం క్షలు తెలిపారు. జర్మనీ బాషపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మందులను రోగులకు సరిగ్గా అందించేందుకు కమ్యూనికేషన్ చాలా కీలకమని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా కూడ బాషలను సులభంగా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గతంలో తాను కేవలం ఐదు లక్షలతో వ్యాపారం ప్రారంభించి మ ద్రాసులో బ్యాంక్ కు వెళ్లినప్పుడు బాష రాక ఇబ్బంది పడ్డానని అప్పుడు బాష ప్రధాన్యత అర్థమైం దని తెలిపారు.
తమిళనాడులో విజయ న్ఉదాహరణకు ప్రస్తావిస్తే ఆధునిక టెక్నాలజీ, సోషల్మీడియా, కమ్యూనికేషన్లను సమర్థవంతంగా వినియోగించుకుంటే విజయాలు సాధిం చవచ్చునని తెలిపారు. ప్రతి రోజు గంట పాటు శ్రమిస్తే బాషను మెరుగుపరుచుకోవచ్చునని జర్మనీ బాషను నేర్చుకోవచ్చునని నర్పులకు సూచించారు. టామ్ కాం కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించిందని వెల్లడించిందని ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో మరిన్న నర్సింగ్ కళాశాలలు సీట్ల పెంపుపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జర్ననీలో ఇప్పటికే నర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నవారితో ఆన్లైన్లో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు.